twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Eesha Rebba Hot Pics: ఘాటు ఫొటోలతో చంపేస్తున్న నటి..తొలిసారి అంత హాట్‌గా!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉత్తరాది అమ్మాయిల హవా కనిపిస్తోన్న తరుణంలో.. లోకల్ బ్యూటీలు కూడా వాళ్లకు ఏమాత్రం తీసిపోరని నిరూపిస్తూ హీరోయిన్‌గా దూసుకుపోతోంది ఈషా రెబ్బా. తద్వారా మన ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు అవకాశాలు దొరకవు అన్న నానుడిని అబద్ధం అని నిరూపిస్తోంది. అందానికి అందం.. నటనకు నటన చేయగల ఈ భామ.. వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ క్లీవేజ్ చేస్తూ దిగిన ఫొటోలను వదిలింది. వాటిపై మీరూ లుక్కేయండి!

    దీపిక దాస్ స్టైలిష్ గ్లామరస్ ఫొటోస్.. లవ్లీగా.. బ్యూటీఫుల్‌గా

     మోడల్‌ నుంచి హీరోయిన్‌గా మారింది

    మోడల్‌ నుంచి హీరోయిన్‌గా మారింది

    సినిమాల్లో రాణించాలన్న లక్ష్యంతో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది ఈషా రెబ్బా. ఈ క్రమంలోనే అందులో తన సత్తాను నిరూపించింది. ఆ సమయంలోనే శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే సినిమా ద్వారా నటిగా పరిచయమైంది. అనంతరం 'అంతకు ముందు ఆ తర్వాత' అనే మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో అద్భుతమైన నటనతో మెప్పించింది.

    చాలా చేసింది.. కానీ, ఆ రెండే అదుర్స్

    చాలా చేసింది.. కానీ, ఆ రెండే అదుర్స్

    ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా. తద్వారా వరుస ఆఫర్లను అందుకుంటోంది. ఇక, ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకూ 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. కానీ, వాటిలో రెండు మాత్రమే సూపర్ హిట్లు అయ్యాయి.

     అన్నీ ఉన్నా... అవకాశాలు మాత్రం నో

    అన్నీ ఉన్నా... అవకాశాలు మాత్రం నో

    అందంలో కానీ, నటనలో కానీ మెప్పిస్తూ దూసుకుపోతోన్న ఈషా రెబ్బా.. కేవలం చిన్న తరహా చిత్రాలకే పరిమితం అవుతోంది. గ్లామర్ షో చేయడానికి రెడీగా ఉన్న పెద్ద హీరోల సినిమాల్లో ఆమె ఎందుకనో అవకాశాలను దక్కించుకోలేకపోతోంది. దీంతో మిగిలిన వారితో పోలిస్తే అంత వేగంగా సినిమాలు చేయలేకపోతోంది. అందుకే ఆమె నటించే సినిమాలు చాలా ఆలస్యం అవుతున్నాయి.

    పెద్ద సినిమాల కోసం అలాంటి పాత్రలతో

    పెద్ద సినిమాల కోసం అలాంటి పాత్రలతో

    భారీ సినిమాల్లో కూడా ఈషా రెబ్బాకు ఆఫర్లు వస్తున్నాయి. అయితే, అవి హీరోయిన్‌గా కాదు.. సెకెండ్ లీడ్‌గానే. అయితే, ఆమె రెండింటిని మాత్రమే ఒప్పుకుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'అరవింద సమేత.. వీరరాఘవ' ఒకటి కాగా.. అక్కినేని అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' రెండోది. ఇది త్వరలోనే విడుదల కాబోతుంది.

    హాట్ వెబ్ సిరీస్‌లో అదుర్స్ అనిపిస్తూ

    హాట్ వెబ్ సిరీస్‌లో అదుర్స్ అనిపిస్తూ

    ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఇటీవల 'పిట్ట కథలు' పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను రూపొందించింది. ఇందులో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన 'పింకీ' అనే సిరీస్‌లో ఈషా రెబ్బా నటించింది. రెండు జంటలైన సత్యదేవ్-ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్‌-ఆషిమా మధ్య అనుబంధాన్ని తెలిపే కథతో రూపొందిన ఇది నిరాశ పరిచింది. కానీ, ఇందులో ఈషా యాక్టింగ్‌కు ప్రశంసలు వచ్చాయి.

    అందులో మాత్రం అస్సలు తగ్గడంలేదు

    అందులో మాత్రం అస్సలు తగ్గడంలేదు

    వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. ఈషా రెబ్బా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవిత విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో గ్లామరస్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ కారణంగానే ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

    Recommended Video

    లస్ట్ స్టోరీస్.. దానికి సిద్ధమైన ఈషా రెబ్బా..!!
    అలా పడుకుని మొత్తం చూపించేసింది

    అలా పడుకుని మొత్తం చూపించేసింది

    అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో అందాల విందు చేస్తూ సెగలు రేపుతోంది ఈషా రెబ్బా. ఇందులో భాగంగానే తాజాగా నేలపై పడుకున్న కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఈ బ్యూటీ క్లీవేజ్ షో చేస్తూ అందాలు ఆరబోసింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఫలితంగా ఈ పిక్స్ చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయ్యాయి.

    English summary
    Telugu film actress Eesha Rebba Full Busy in Social Media. Now She Shared a Hot Clavage Photo in Her Instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X