అలాంటి డ్రెస్‌తో గాలమేస్తోన్న తెలుగు హీరోయిన్.. హాట్ పిక్స్‌తో హల్‌చల్
టాలీవుడ్ తెరపై వెలిగిపోయే తెలుగమ్మాయిలు కొంతమందే ఉంటే.. అందులో ఈషా రెబ్బా ప్రస్తుతం ఊపేస్తోంది. హీరోయిన్, సైడ్ క్యారెక్టర్స్ ఇలా అవకాశం వచ్చిన ప్రతీ పాత్రను చేసుకుంటూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.

అరవింద సమేతలో పూజా హెగ్డే పక్కన
అంతవరకు పెద్ద సినిమాలో చాన్స్ దొరకని ఈషాకు, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ లాంటి దర్శకుడి సినిమా అనగానే ఓకే అనేసింది. అరవింద సమేతలో కనిపించేది కొద్దిసేపే అయినా తన లుక్స్‌తో ఆకట్టుకుంది.

అందం ఉన్నా అదృష్ట్ం మాత్రం..
ఈషా రెబ్బాకు అందం బోలెడంతా ఉన్నా అదృష్టం మాత్రం అంతగా లేనట్టు కనిపిస్తోంది. తాను చేసినా ఏ సినిమా కూడా అంతగా విజయం సాధించలేకపోతోంది. చిన్న సినిమాల్లో మెరుస్తూ ఉన్నా.. పెద్ద సినిమాల్లో మాత్రం అవకాశం రావడం లేదు.

బ్రాండ్ బాబు, సుబ్రహ్మణ్యపురం..
చిన్న సినిమాలకు ఈషా రెబ్బా కరెక్ట్ ఆప్షన్ అని చిన్న నిర్మాతలు, దర్శకులు భావిస్తున్నారు. కావాల్సినంత అందం, ప్రతిభ ఉండటం, రెమ్యూనరేషన్ విషయం ఇలా అన్ని కలిసి ఉండటంతో ఈషారెబ్బాకు బాగానే అవకాశాలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్...
అయితే తాను గ్లామర్ పాత్రలకు కూడా సిద్దమే అన్నట్లుగా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తన అందంతో ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తూ ఉండే ఈషా సోషల్ మీడియాలో ఫుల్ స్పీడ్‌గా ఉంటుంది. తాజాగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెటిజన్లకు మత్తెక్కించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











