రూట్ మార్చేసిన ఈషా.. అలాంటి సీన్స్‌తో రెచ్చగొట్టేందుకు రెడీ

వెండితెరపై బోల్డ్ సీన్స్‌కు కాసింత కత్తెరలు పడతాయి. కానీ వెబ్ సిరీస్‌లో హద్దులనేవే ఉండాయి. ఎవరు ఎంతగా రెచ్చిపోయినా అడిగే వారుండరు. అందుకే అలాంటి ఫ్లాట్‌ఫామ్‌లో బోల్డ్ కాన్సెప్ట్‌లకు గిరాకీ ఎక్కువైంది. అలాంటి కథల నేపథ్యంలో తెరకెక్కే వెబ్ సీరిస్‌లకు డిమాండ్ చాలానే ఉంది. పైగా అందులో నటించడం, హద్దులు దాటి మరి రొమాన్స్ పండించే నటీమణులకూ చాన్స్‌లు పరిగెత్తు వస్తున్నాయి. ఆ మధ్య బాలీవుడ్‌లో వచ్చిన లస్ట్ స్టోరీస్‌ ఏ రేంజ్‌లో వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

రాధికా ఆప్టే ఫుల్ ఫేమస్ ..

రాధికా ఆప్టే ఫుల్ ఫేమస్ ..

లస్ట్ స్టోరీస్‌లో అనే సిరీస్‌లో నాలుగు కథలుండగా.. ఒక్కో కథను ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తాడు. వాటిలో రాధికా ఆప్టే తన స్టూడెంట్‌తో అఫైర్ పెట్టుకోవడం ఓ కథగా సాగుతుంది. ఆ సీన్స్‌లో రాధికా యాటిట్యూడ్, రొమాన్స్ పండించిన విధానం అందర్నీ ఆకట్టుకుంది.

కియారా సీన్ వైరల్..

కియారా సీన్ వైరల్..

కియారా అద్వాణీ నటించిన ఓ సీన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కియారా.. ఓ స్కూల్ టీచర్‌గా పని చేస్తూ ఉంటుంది. వైవాహిక జీవితంలోని అసంతృప్తిని తీర్చుకునేందుకు స్నేహితురాలి సలహా మేరకు వైబ్రేటర్‌ను ఉపయోగిస్తుంది. ఇంట్లో ఓ సారి దాన్ని వాడే క్రమంలో ఎదురైన సంఘటన, ఆ సీన్స్‌లో కియారా హావభావాలు అందరికీ మత్తెక్కించాయి. ఈ ఒక్క సీన్‌తో కియారా ఎక్కడికో వెళ్లిపోయింది.

తెలుగులో లస్ట్ స్టోరీస్..

తెలుగులో లస్ట్ స్టోరీస్..

అలాంటి బోల్డ్ కాన్సెప్ట్‌, సీన్స్‌తో ఉన్న లస్ట్ స్టోరీస్.. తెలుగులో రీమేక్ అవుతోంది. అయితే అక్కడి ప్రేక్షకులకు అలాంటి సన్నివేశాలు కామన్ అయినా.. తెలుగు ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. అక్కడి మాదిరి ఇక్కడ కూడా ఒక్కో కథను ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. తెలుగులోనూ అదే మాదిరిగా ఒక్కో కథను ఒకరు డైరెక్ట్ చేయనుండగా.. నందినీ రెడ్డి, తరుణ్ భాస్కర్‌లు చెరో కథకు దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.

మరో పాత్రను పోషించనున్న అమలాపాల్..

మరో పాత్రను పోషించనున్న అమలాపాల్..

ఆమె చిత్రంతో బోల్డ్ పాత్రలకు తాను కూడా సై అనేట్టుగా ఓ సిగ్నల్ ఇచ్చేసింది అమలాపాల్. కథ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించేందుకు కూడా వెనకాడనని నిరూపించింది. అలాంటి అమలాపాల్.. లస్ట్ స్టోరీస్ రీమేక్‌లో రాధికా ఆప్టే పాత్రను పోషించే అవకాశమున్నట్టు సమాచారం.

Recommended Video

Cine Box : RRR Updates,Rajamouli Fully Focused On NTR And Ram Charan For RRR !
బోల్డ్ సీన్స్‌తో రెచ్చగొట్టేందుకు ఈషా రెడీ..

బోల్డ్ సీన్స్‌తో రెచ్చగొట్టేందుకు ఈషా రెడీ..

ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు కియారా అద్వాణీ పాత్రలో ఈషా రెబ్బా నటిస్తోందని టాక్. మరి ఈ పాత్రకు ఈషా కరెక్ట్‌గానే సూట్ అయినా.. ఆ వైబ్రేటర్ సీన్‌ను ఎలా హ్యాండిల్ చేస్తుందనేది చూడాలి. బాలీవుడ్‌లో ఆ కథను కరణ్ జోహార్ అత్యంత జాగ్రత్తగా, సున్నితంగా తెరకెక్కించాడు. మరి తెలుగులో ఆ కథను ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X