మొత్తానికి ఓ బంపర్ ఆఫర్ అందుకున్న తెలుగమ్మాయి

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్స్ లలో ఈషా రెబ్బ ఒకరు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లో ఒక చిన్న రోల్ లో నటించిన ఈ బ్యూటీ మెల్లమెల్లగా కొన్ని చిన్న సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన అంతకుముందు, ఆ తరువాత బందిపోటు, అమీ తుమీ.. వంటి సినిమాలతో హీరోయిన్ గా క్లిక్కయిన విషయం తెలిసిందే.

అయితే ఈ తెలుగమ్మాయి రేంజ్ కేవలం చిన్న సినిమాలకే పరిమితం కావడంతో అప్పుడప్పుడు పెద్ద సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చింది. అరవింద సమేతలో హీరోయిన్ సిస్టర్ గా నటించింది కూడా. ఇక ఇటీవల కాలంలో అమ్మడు గ్లామర్ ఫొటో షూట్స్ ఓ వర్గం వారిని బాగానే ఎట్రాక్ట్ చేశాయి. ఇక ఫైనల్ గా అమ్మడికి ఒక బంపర్ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. గోపిచంద్, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందట.

భర్తతో బిగ్‌బాస్ బ్యూటీ రొమాంటిక్ హాలీడే.. కొండ కోనల మధ్య పూజా రామచంద్రన్ కెమిస్ట్రీ (ఫోటోలు)

Eesha rebba key role in gopichand maruthi film

ఇటివల ఎనౌన్స్ చేసిన ఆ సినిమాకు పక్కా కమర్షియల్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇక రాశి ఖన్నాను మెయిన్ హీరోయిన్ గా ఫైనల్ చేసిన చిత్ర యూనిట్ మరో గ్లామరస్ పాత్ర కోసం ఈషా రెబ్బను అనుకుంటున్నట్లు సమాచారం. ఆ పాత్ర క్లిక్కయితే ఈషా రేంజ్ తప్పకుండా మరో లెవెల్ కు వెళ్లడం కాయమని సమాచారం. మరి అమ్మడు ఈ సినిమాతో అయినా అగ్ర హీరోలతో ఛాన్స్ అందుకుంటుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X