మొన్న కాజల్.. నేడు ఇషా.. ఏంటి అందాలు యూ టర్న్ తీసుకున్నాయా..?
సాధారణంగా హీరోయిన్లంతా సోషల్ మీడియాను తమ హాట్ హాట్ అందాలతో వేడెక్కిండం చూస్తున్నాం. కానీ దీనికి భిన్నంగా ఇటీవలే కాజల్ ఎలాంటి మేకప్ లేకుండా తన ఒరిజినల్ పిక్ పెట్టి షాకిచ్చింది. అంతేకాదు ఒరిజినల్‌గా ఉండటంలో ఉన్న తృప్తి ముఖానికి రంగులేసుకుంటే ఉండదని సందేశమిచ్చింది. సరిగ్గా ఇదే ఫాలో అవుతున్నట్లుంది తెలంగాణ బ్యూటీ ఈషా రెబ్బా. తాజాగా ఆమె పెట్టిన ఫోటో షూట్ ఇందుకు దర్పణం పడుతోంది.
తెలంగాణలో పుట్టి హైదరాబాద్ లోనే పెరిగింది అందాల తార ఈషా రెబ్బా. తెలుగు తెరపై ఇతర భాషా నటీమణులు రాణిస్తుండగా.. తమకేం తక్కువ అన్నట్లుగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిందీ సుందరి. ఈషాలో అందానికి ఏ మాత్రం కొదవలేదు. ముంబై భామలను మించిన గ్లామర్ ఈమె సొంతం. కాకపోతే ఇండస్ట్రీ నుంచి సరైన అవకాశాలు అందిపుచ్చుకోవడం లేదు. ఇలాంటి సందర్భంలో ఏ హీరోయిన్ అయినా రెచ్చిపోయి అందాలు ఆరబోస్తుంది. కానీ ఈషా మాత్రం తాను ప్రత్యేకం అని నిరూపించింది. ఏ మాత్రం మేకప్ లేకుండా తన ఒరిజినల్ లుక్ తో దిగిన ఫోటో షూట్‌ని తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది ఈషా రెబ్బా.

ఈ ఫోటో షూట్‌లో బ్లూ టీ షర్టు, జీన్స్ ప్యాంట్ వేసుకొని స్టైలిష్ లుక్ ఇచ్చిన ఈషా ఏ మాత్రం తన శరీర సౌందర్యాన్ని బయటపెట్టలేదు. ఒరిజినల్ లుక్‌లో ఉండి.. అందంగా కనిపిస్తున్న ఈమె పిక్స్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. ఫిదా హోగయా, నువ్వు కేక డార్లింగ్, వరంగల్ భామ వెరీ బ్యూటిఫుల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది గానీ తన ఒరిజినల్ లుక్ చూసైనా దర్శకనిర్మాతల కన్ను ఈ తెలంగాణా పిల్లపై పడుతుందా? లేదా? అనేది చూడాలి మరి. కాగా మొన్న కాజల్, నేడు ఈషా పెట్టిన నాచురల్ పిక్స్ చూసి.. ఏంటి సోషల్ మీడియాలో అందాలు యూ టర్న్ తీసుకున్నాయా..? అని ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు.


Click it and Unblock the Notifications











