విచిత్రమైన డ్రెస్‌లో తెలుగు పిల్ల అరాచకం: ఇది అట్టాంటిట్టాంటి షో కాదుగా!

ఆకట్టుకునే అందం.. అదిరిపోయే నటన చేయగల సత్తా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది అమ్మాయిలు పెద్దగా అవకాశాలను దక్కించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో లోకల్ బ్యూటీ ఈషా రెబ్బా ఒకరు. అన్నీ ఉన్నా అదృష్టం, కథల ఎంపికలో జాగ్రత్తలు లేకపోవడంతో ఈ అమ్మడు కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా తీసుకు వెళ్లలేకపోతోంది. ఫలితంగా పెద్దగా ప్రభావాన్ని చూపడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈషా రెబ్బా తనదైన శైలిలో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి మరి!

అలా వచ్చిన తెలుగు పిల్ల

అలా వచ్చిన తెలుగు పిల్ల

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దక్కవు అన్న టాక్ ఉన్నా.. ఈషా రెబ్బా సినిమాల్లో నటించేందుకు చాలా ప్రయత్నాలే చేసింది. ఈ క్రమంలోనే మోడల్‌గా విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అలా ఫేమస్ అవడంతో 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' మూవీతో నటిగా వచ్చింది. అనంతరం 'అంతకు ముందు ఆ తర్వాత'తో హీరోయిన్‌గా పరిచయం అయింది.

ఎన్నో సినిమాలు చేసినా

ఎన్నో సినిమాలు చేసినా


హీరోయిన్‌గా మొదటి చిత్రంలోనే ఆకట్టుకోవడంతో ఈషా రెబ్బాను మంచి గుర్తింపు దక్కింది. దీంతో ఆమె వరుసగా 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో సినిమాలు చేసింది. అయితే, వీటిలో కేవలం ఓ రెండు మూడు చిత్రాలు మాత్రమే సక్సెస్ అవడం ఆమెకు నిరాశనే మిగిల్చేసింది.

అందుకే హిట్లు రావట్లేదు

అందుకే హిట్లు రావట్లేదు

అందానికి అందం, అభినయానికి అభినయం చేయగల ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ సందడి చేస్తూనే ఉంది. కానీ, ఈ అమ్మడికి ఎందుకనో భారీ ఆఫర్లు మాత్రం ఇప్పటి వరకూ రాలేదు. దీనికితోడు కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఉన్న అవకాశాలను కూడా ఈ అమ్మడు సద్వినియోగం చేసుకోలేకపోతోంది. దీంతో ఆమె కెరీర్ సాఫీగా సాగడం లేదు.

అలా కూడా చేయడానికి

అలా కూడా చేయడానికి

సినిమాల పరంగా ఆఫర్లు వస్తున్నా హీరోయిన్‌గా అనుకున్న రేంజ్‌లో హడావిడి చేయలేకపోతోన్న ఈషా రెబ్బా.. రెండో హీరోయిన్‌గా చేయడానికి కూడా ముందుకు వస్తోంది. ఇందులో భాగంగానే 'అరవింద సమేత.. వీరరాఘవ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేసింది. వీటితో పాటు 'పిట్ట కథలు' అనే వెబ్ సిరీస్‌లోనూ ఈషా రెబ్బా నటించింది.

అందులో మాత్రం బిజీగా

అందులో మాత్రం బిజీగా

హీరోయిన్‌గా పరిచయమైన తర్వాత ఎన్నో సినిమాలు చేసినా పెద్దగా హిట్లను అందుకోలేకపోయిన ఈషా రెబ్బా.. కెరీర్‌తో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతూ క్రేజ్ పెంచుకుంటోంది.

అందాలు ఆరబోస్తోందిగా

అందాలు ఆరబోస్తోందిగా


సోషల్ మీడియాలో చాలా ఏళ్లుగా తెగ సందడి చేస్తోన్న తెలుగు పిల్ల ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే హాట్ డ్రెస్‌లలో ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. దీంతో ఈషా రెబ్బా గ్లామర్ ట్రీట్‌లోనూ తగ్గనని చాటుకుంటోంది. ఇలా తన హాట్ షోతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ.. తెగ హైలైట్ అవుతోంది.

విచిత్రమైన డ్రెస్‌తో అలా

విచిత్రమైన డ్రెస్‌తో అలా

ఈషా రెబ్బా సోషల్ మీడియాలో తరచూ తన ఫొటోషూట్‌లను షేర్ చేస్తుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని పిక్‌లను షేర్ చేసింది. వీటిలో ఆమె విచిత్రమైన డ్రెస్‌తో ఘాటు ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె క్లీవేజ్, థైస్ అందాలు బాగా హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈషా రెబ్బా షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కి.. వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X