పొట్టి డ్రెస్‌లో గీత దాటేసిన తెలుగు పిల్ల: ఓర్నాయనో ఆ ఫోజులేంటి సామీ!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు లోకల్ అమ్మాయిల జాడ కనిపించేది కాదు. కానీ, ఇప్పుడు మాత్రం ఎంతో మంది భామలు తమదైన రీతిలో సందడి చేస్తూ ముందుకెళ్తోన్నారు. అందులో హైదరాబాదీ చిన్నది ఈషా రెబ్బా ఒకరు. ఆకట్టుకునే అందం.. అదిరిపోయే నటనతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ చిన్నది.. వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ హడావిడి చేస్తూ రచ్చ లేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈషా రెబ్బా కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. అవి మీరే చూడండి!

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి
మోడలింగ్ రంగంలో సత్తా చాటుతూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ఈషా రెబ్బా 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ వెంటనే 'అంతకు ముందు ఆ తర్వాత'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేసింది. ఇది మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఆమె యాక్టింగ్ పరంగా మెప్పించడంతో ఈషాకు ఆఫర్లు భారీగా వచ్చాయి.

చాలా మూవీలు... సక్సెస్ రాలే
హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీని అందుకున్న ఈషా రెబ్బా.. ఆ తర్వాత 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే, వీటిలో కేవలం ఓ రెండు మూడు సినిమాలే విజయం సాధించాయి. కానీ, ఫలితాలతో సంబంధం లేకుండా ఆమె సినిమాలు చేసింది.

పొరపాట్లతో కెరీర్‌కు ఇబ్బంది
అందం, అభినయంతో పాటు నార్త్ సైడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా గ్లామర్ షో చేసినా ఈషా రెబ్బాకు పెద్దగా ఆఫర్లు రావడం లేదనే చెప్పాలి. దీనికితోడు ఈ సుందరాంగి వచ్చిన ప్రతి సినిమా చేయడంతో సక్సెస్ రేటును అంతగా అందుకోలేకపోయింది. ఈ పొరపాటే ఆమె కెరీర్‌కు ప్రతిబంధకంగా మారింది. ఫలితంగా ఈషా కెరీర్ ఆశించిన రీతిలో సాగడం లేదనే చెప్పాలి.

అక్కడ మాత్రం ఫుల్ బిజీగానే
ఎన్నో సినిమాలు పరాజయం పాలైనా వరుసగా సినిమాలను చేసుకుంటూ వచ్చిన ఈషా రెబ్బా.. ఈ మధ్య కాలంలో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతోంది. ఫలితంగా టాలీవుడ్‌లో అవకాశాలను అందుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే మలయాళంలో 'ఒట్టు', తమిళంలో 'నితమ్ ఓరు ఓనమ్', 'ఆయిరామ్ జన్మంగళ్' అనే సినిమాలు చేసింది. అలాగే, తెలుగులోనూ బిజీగా మారింది.

సోషల్ మీడియాలో సందడి
హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలెట్టినప్పటి నుంచి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న ఈషా రెబ్బా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా గడుపుతోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

ఎక్కువగా హాట్ షో చేస్తోంది
చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోన్న తెలుగు భామ ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఈ మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోతోన్న ఈ చిన్నది హాట్ డ్రెస్‌లలో ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఈషా రెబ్బా గ్లామర్ ట్రీట్‌లోనూ తగ్గనని చెప్తోంది. అలాగే, నిత్యం ట్రెండింగ్ అవుతోంది.

పొట్టి డ్రెస్‌లో ఈషా హల్చల్
సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోన్న ఈషా రెబ్బా తాజాగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వీటిలో ఆమె షార్ట్ డ్రెస్ వేసుకుని రచ్చ చేసింది. ఫలితంగా వీటిలో ఆమె ఎద, తొడ అందాలు బాగా హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈషా రెబ్బా షేర్ చేసిన ఈ ఫొటోలకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇవన్నీ తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











