ఈషా రెబ్బ కొత్త ప్రయోగం.. హర్రర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్!
తెలుగు అమ్మాయిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈషా రెబ్బ హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కానీ ఈషా రెబ్బ కెరీర్ జోరు పెంచే అవకాశాలు ఆమెకు ఇంకా దక్కలేదు. గత ఏడాది అరవింద సమేత చిత్రంలో నటించినా అది అంతగా ప్రాధాన్యత లేని పాత్ర. దీనితో ఈషా హీరోయిన్ గా నటిస్తూనే నటనకు ప్రాధ్యానత ఉన్న చిత్రాలు చేయాలని భావిస్తోంది.
తాజాగా ఈషా రెబ్బ ఓ హర్రర్ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఢమరుకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి ఓ హర్రర్ కథని ఇషాకు వినిపించాడట. కథ నచ్చడంతో ఈషా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆధ్యంతం ఉత్కంఠభరితంగా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా రోజుల నుంచి లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించాలని ఈషా రెబ్బ ఆసక్తి చూపుతోంది.

ఇలా హర్రర్ చిత్రంతో ఈషా కోరిక తీరబోతోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర ఈషాదే. అరవింద సమేత చిత్రంతో పాటు ఈషా రెబ్బ గత ఏడాది సుబ్రహ్మణ్యపురం చిత్రంలో నటించింది. ఈ చిత్రం విజయం సాధించలేదు. ఈ హర్రర్ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











