ఎప్పుడూ 'అరవింద సమేత' లాంటి సినిమాలే కాదు.. ఆర్ఆర్ఆర్ నా వరకు రాలేదు!

వరుస అవకాశాలతో తెలుగు అమ్మాయి ఇషా రెబ్బ దూసుకుపోతోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న ఏకైక తెలుగు హీరోయిన్ ఇషా రెబ్బ అని చెప్పొచ్చు. తాజాగా ఇషా రెబ్బ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు హీరోయిన్లు రాణించలేరు అని విషయంపై తన అభిప్రాయం తెలియజేసింది. గ్లామర్ పాత్రలు చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది.

 ఆ పరిస్థితి ఇప్పుడు లేదు

ఆ పరిస్థితి ఇప్పుడు లేదు

తెలుగు హీరోయిన్లు ఇండస్ట్రీలో రాణించలేరు అనే అపవాదు గతంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలుగు అమ్మాయిలకు కూడా అవకాశాలు పెరుగుతున్నాయి అని ఇషా రెబ్బ తెలిపింది. నాకు తెలుగులో అవకాశాలు బాగానే వస్తున్నాయి. కానీ వాటిలో కొన్ని కథలని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నట్లు ఇషా రెబ్బ తెలిపింది. కొత్త దర్శకులతో, కొత్త కాంబినేషన్ లో నటించాలని నేను ఎప్పుడూ భావిస్తుంటాను అని ఇషా తెలిపింది.

 ఎన్టీఆర్, త్రివిక్రమ్ కోసమే

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కోసమే

హీరోయిన్ గా చేస్తూనే అరవింద సమేత లాంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేస్తున్నారు కదా అనే ప్రశ్నకు ఇషా రెబ్బ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఎప్పుడూ లాంటి చిత్రాలే చేయను. ఆ సినిమా ఎన్టీఆర్, త్రివిక్రమ్ కోసం మాత్రమే చేశా అని ఇషా రెబ్బ తెలిపింది. మంచి కాబినేషన్స్ ఉన్నప్పుడు అలాంటి చిత్రాలు కూడా చేయాల్సి వస్తుంది అని ఇషా తెలిపింది.

ఆర్ఆర్ఆర్ సినిమాలో

ఆర్ఆర్ఆర్ సినిమాలో

ఆర్ఆర్ఆర్ చిత్రంలో నేను నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతవరకు అలాంటి చర్చలు నా దాకా రాలేదు. అలాంటి సినిమాల్లో నటించే అవకాశం వస్తే చాలా సంబర అపడుతాను అని ఇషా రెబ్బ తెలిపింది. గత కొన్ని రోజులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ లో ఇషా రెబ్బ ఛాన్స్ దక్కించుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

గ్లామర్ పాత్రల్లో

గ్లామర్ పాత్రల్లో

ఇతర భాషల్లో నటించే ప్రయత్నాల గురించి ఇషా తెలిపింది. తెలుగులోనే మంచి అవకాశాలు వస్తున్నాయి. అలాంటప్పుడు ఇతరభాషల వైపు ఎందుకు చూడాలి. ప్రియాంక జవాల్కర్ మరాఠి అమ్మాయే కానీ పెరిగింది అంతా ఇక్కడే. ప్రియాంకకు టాక్సీవాలా లాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం వచ్చింది కదా అని ఇషా తెలిపింది. టాలెంట్ ఉంటె తెలుగు అమ్మాయిలకు కూడా అవకాశాలు వస్తాయి. ఇక అవరమైన మేరకు గ్లామర్ పాత్రల్లో నటించడానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇషా తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X