నా బాడీని జూమ్ చేసి... ఆ స్టార్ డైరెక్టర్ దారుణంగా... ఈషా రెబ్బా షాకింగ్ కామెంట్స్

అచ్చ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా దాదాపు 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా ఇప్పటి వరకు సరైన బ్రేక్ అందుకోలేకపోయింది. కానీ పట్టు వదలకుండా తన పోరాటం సాగిస్తూనే ఉన్నారు. తెలుగు, తమిళ్ తదితర భాషల్లో నటనతో పాటు సినిమాలు, వెబ్ సిరీస్‌లలోనూ తన అదృష్టం పరీక్షించుకున్నారు. అందం, అభినయం దండిగా ఉన్నప్పటికీ అవకాశాలు రాకపోవడం ఈషాను బాధిస్తోంది. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ సరసన ఓం శాంతి శాంతి అనే సినిమాలో ఈషా రెబ్బా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

చిన్నప్పటి నుంచే ఇంటర్నల్‌గా యాక్టింగ్‌పై నాకు ఆసక్తి ఏర్పడింది. సీన్ ఇస్తే చేయగలుగుతాననే అనుకున్నాను. కానీ ఎవరిని అడగాలి? ఎలా అప్రోచ్ కావాలి అనేది తెలియదు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా తర్వాత కాలేజ్ పూర్తి చేశాను, మోడలింగ్‌లో దిగాను. సినిమాలు చేస్తే లీడ్ రోల్సే చేయాలని అనుకున్నాను. ఆ తర్వాత ఆడిషన్స్ కూడా ఏం ఇవ్వలేదు. అయితే ఓ ఫ్రెండ్ సలహా మేరకు ఓ ద్విభాషా చిత్రానికి ఆడిషన్స్ ఇచ్చాను. ఆ సమయంలో చాలా టెన్షన్ పడ్డాను. నేను కొన్ని షోలు చేసినప్పుడు కూడా ఈ అమ్మాయి ఏంటీ? అసలు ఏం బాగుంది? ఇలాంటి మాటలు వినిపించేవి. కానీ నేను ఎవ్వరినీ ఏం అనే దానిని కాదని ఈషా చెప్పారు.

Eesha Rebba Opens Up on Industry Bias Name Changes and Struggles for Opportunities

కాలేజ్ డేస్‌లోనూ నన్ను ఎవరూ ర్యాగింగ్ చేయలేదు. కానీ ఏ విషయంలోనైనా నేను కాన్ఫిడెంట్‌గా ఉండేదానిని. ప్రతిదీ ప్రయత్నించడమైతే చేయాలి.. రిజల్ట్ సంగతి తర్వాత చూసుకుందాం అన్నట్లుగానే వెళ్లేదానిని. డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ గారు నా పిక్చర్స్ ఫేస్‌బుక్‌‌లో చూసి హిందీ అమ్మాయి అనుకున్నారు. ఆ ఫోటోషూట్ ముంబైలో చేయించుకోవడంతో ముంబై అమ్మాయిలా ఉన్నాను. ఆ ఫోటోలు, ఇప్పుడు ఫోటోలు పక్కపక్కనే పెడితే ఇద్దరూ వేర్వేరు అనుకుంటారు. ఆ వెంటనే మోహనకృష్ణ గారి ఆఫీస్ నుంచి వచ్చింది. మేల్ క్యారెక్టర్‌కు నవీన్ పొలిశెట్టిని, ఫిమేల్ క్యారెక్టర్‌కి నన్ను తీసుకున్నారు. మా ఇద్దరికి కలిపి ఆడిషన్స్ చేశారు.. నవీన్ చాలా బాగా చేశాడు. దాంతో నన్ను పక్కగా తీసేస్తారని అనుకున్నాను. అయితే మోహన్‌గారు రిహార్సల్స్ చేయాలని చెప్పారు. కొద్దిరోజులకే సెలెక్ట్ అయినట్లుగా ఫోన్ రావడంతో సంతోషం తట్టుకోలేకపోయాను అని ఈషా పేర్కొన్నారు.

కెరీర్ విషయంలో అమ్మ నాకు చాలా సపోర్ట్ చేసింది. కానీ నాన్నకు మాత్రం ఇండస్ట్రీ అస్సలు ఇష్టం ఉండేది కాదు. దర్శకుడు అనే సినిమా సమయంలో అమ్మ చనిపోయిందని తెలిసింది. 11 రోజుల కార్యక్రమం ముగిసిన తర్వాత 12వ రోజే షూటింగ్‌కి వెళ్లిపోయా. ఆ బాధ తర్వాత నాకు ఏడుపు తగ్గిపోయింది. ఇంట్లో ఒక్కదానినే ఉంటే ఏడుస్తాను. తల్లిదండ్రులు ఉంటే ఆ ప్రొటెక్షన్ వేరు. లేదంటే ఆడపిల్ల అందరికీ టార్గెట్ అయిపోతుంది. నాకు సౌందర్య గారి సినిమాలంటే చాలా ఇష్టం. రెండు మూడు రోజులు ఆమె చేసిన క్యారెక్టర్‌లోనే ఉండిపోతాను అని ఈషా రెబ్బా తెలిపారు.

కెరీర్ స్టార్టింగ్‌లో తెల్లవారుజామున 4 గంటల వరకు అంబాసిడర్ కారును మా ఇంటికి పంపించేవారు. 4 గంటలకు బయల్దేరితే 10 గంటలకు సెట్‌లో ఉండే దానిని. అందులో ఎంతమంది ఇరుక్కునేవాళ్లం. సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు చాలా ఎక్కువ. ఎదుటివాళ్లు నన్ను చూసిన విధానాన్ని బట్టే నా ప్రవర్తన ఉంటుంది. అంతపొద్దున్నే లేచి సెట్‌కి వెళ్లినా మన క్యారెక్టర్‌కు ఒకటి, రెండు షాట్సే ఉండేవి. ఇదంతా చూస ఇరిటేషన్ వచ్చేది. నాకు లీడ్ రోల్ చేయాలని గట్టిగా ఉండేది. కొంతమంది నాకు ఛాన్స్ ఉందా? లేదా? అనేది డైరెక్ట్‌గా చెబితే.. మరికొందరు మేనేజర్స్ ద్వారా చెప్పేవాళ్లు. అంతకుముందు ఆ తర్వాత సినిమా ప్రీమియర్స్ తర్వాత కొందరు సినీ ప్రముఖులు నాకు ఫోన్ చేసి మెచ్చుకున్నారని ఈషా పేర్కొన్నారు.

అవకాశాలు రావాలంటే పార్టీలకు రావాలి, సోషల్‌గా కలిసిపోవాలని కొందరు ఉచిత సలహాలు ఇచ్చేవాళ్లు. కానీ నేను ఫలానా క్యారెక్టర్‌కు సెట్ అయితేనే వాళ్లు నన్ను కలుస్తారు కానీ ఎంతగా కలిసిపోయినా అవకాశాలు రావు. ఇంటి పేరుతో కొందరు హేళన చేయడంతో రెబ్బాను తీసేసి కేవలం ఆర్ ఈషా అని పెట్టుకున్నా. ఒక అవార్డ్ షోలో నన్ను ఈషా గుప్తా అని పిలవడంతో షాక్ అయ్యా. దాంతో ఇదంతా కాదు.. ఈషా రెబ్బా అని మార్చేసుకున్నా. జీవితంలో ఎలా ఉండాలో ఇండస్ట్రీయే నాకు నేర్పించింది. నా యాక్టింగ్ బాగుందని చాలా మంది చాలా పొగిడారు. కానీ అవకాశాలు మాత్రం రాలేదు. మీ పేరు చాలా బాగుంది. తెలుగు అమ్మాయి అని చెప్పొద్దు.. బెంగళూరు అని చెప్పండి, కొంచెం తెల్లగా ఉంటే బాగుండేదని సలహాలు ఇచ్చేవారు. ఒకసారి ఓ సినిమా కోసం ఫోటో షూట్ చేశారు. ఆ డైరెక్టర్ నా ఫోటోలను అంగుళం అంగుళం జూమ్ చేసి.. మీ మోచేతులు నల్లగా ఉన్నాయి, మరింత అందంగా ఉండాలని అన్నాడు. ఆ మాటలతో చాలా బాధపడ్డా.. కొంచెం తెల్లగా పుట్టి ఉంటే బాగుండు అనుకున్నా. మన తెలుగు అమ్మాయి అని అందరూ మెచ్చుకుంటారు. కానీ అవకాశాలు మాత్రం ఇవ్వరు. కానీ నేను ఎక్కడికి వెళ్లినా తెలుగు అమ్మాయే అని చెప్పుకున్నా అని ఈషా రెబ్బా ఆవేదన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X