కిటికీ లాంటి చీర కట్టి కవ్విస్తోన్న ఈషా రెబ్బా .. ఆ షేపులూ చూస్తే పిచ్చెక్కాల్సిందే
అచ్చ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బాకు అనుకున్నంత స్టార్‌డమ్ రాలేదు. అందం, అభినయం అన్నీ ఉన్నా ఎందుకో ఈ ముద్దుగుమ్మకు లక్ మాత్రం కలిసి రాలేదు. దీంతో స్టార్ డమ్ కోసం ఆమె అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈషా రెబ్బా తన వ్యక్తిగత విషయాలను, సినిమా సంగతులను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
19 ఏప్రిల్ 1990న వరంగల్‌లో జన్మించారు ఈషా రెబ్బా. హైదరాబాద్‌లో పెరిగిన ఈమె, అక్కడే ఎంబీఏ వరకు చదువుకున్నారు. కాలేజ్ రోజుల్లోనే మోడల్‌గా పనిచేసిన ఈషా.. తర్వాత నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టారు ఈషా రెబ్బా . తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంతకుముందు ఆ తర్వాత సినిమాతో గుర్తింపు సంపాదించుకున్నారు.

అనంతరం ఈషా రెబ్బాకు వరుస ఆఫర్లు క్యూకట్టాయి. బందిపోటు, ఓయ్, అమీతుమీ, దర్శకుడు, బ్రాండ్ బాబు, అరవింద సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం, సవ్యసాచి, రాగల 24 గంటల్లో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, ఓట్టు, మమా మశ్చీంద్ర వంటి సినిమాలు చేశారు. తర్వాత పెద్దగా ఆమెకు అవకాశాలు దక్కలేదు. కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఈషా రెబ్బా.
ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు దశాబ్ధకాలం పూర్తి చేసుకున్న ఈషా.. పెద్ద సినిమాల్లో చిన్న రోల్స్ చేయగా, ఆమె లీడ్ రోల్ చేసిన సినిమాలు ఆడకపోవడంతో రేసులో వెనుకబడిపోయింది. ఈషా కంటే వెనుక వచ్చిన రష్మిక , శ్రీలీల, మీనాక్షి చౌదరి వంటి తారలు స్టార్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తుండగా ఆమె మాత్రం అక్కడే ఉండిపోయారు. ఓ వైపు మాతృభాష తెలుగులో సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లోనూ జెండా పాతాలని ట్రై చేస్తోంది.
అందం, అభినయం పరంగా ఈషా రెబ్బాకు తిరుగులేదు. ఆమె కష్టానికి కాస్తంత అదృష్టం తోడయితే ఆపడం ఎవరి తరం కాదు. ప్రస్తుతం ఓటీటీల ట్రెండ్ బాగా నడుస్తుండటంతో ఈషా రెబ్బాకు కాలం కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమాలు ఉన్నా , లేకపోయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటారు ఈషా రెబ్బా. హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లకి సెగలు రేపుతుంటారు. తాజాగా కిటికీల మాదిరిగా ఉన్న బ్లాక్ కలర్ శారీలో నడుము, ఎద అందాలను చూపిస్తూ కవ్విస్తున్నారు ఈషా. మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్ వేయండి.


Click it and Unblock the Notifications











