సెల్పీతో మిర్రర్ చెక్.. మత్తెక్కించే చూపులతో కవ్విస్తోన్న ఈషా రెబ్బా
అచ్చ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బాకు అనుకున్నంత స్టార్‌డమ్ రాలేదు. అందం, అభినయం అన్నీ ఉన్నా ఎందుకో లక్ మాత్రం కలిసి రాలేదు. దీంతో ఇంకా పోరాటం చేస్తూనే ఉంది. అయితే వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టక తన వంతు న్యాయం చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈషా రెబ్బా తన వ్యక్తిగత విషయాలను, సినిమా సంగతులను పంచుకుంటూ ఉంటారు. సోషల్ ఇష్యూస్‌పైనా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటారు.
ఇటీవలి కాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు ఈషా రెబ్బ. మొన్నామధ్య పీరియడ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారామె. షూటింగ్ సమయంలో పీరియడ్స్ వస్తే ఇతర కంపెనీలు, వర్క్ ప్లేస్‌ల మాదరిగా లీవ్ పెట్టడానికో, మధ్యలో వదిలిపెట్టి పోవడానికో చిత్ర పరిశ్రమలో టైం ఉండదని ఈషా రెబ్బ తెలిపారు. ఎందుకంటే షూటింగ్ టైమింగ్, బోల్డెంత ఖర్చు, ఆర్టిస్టులతో కాంబినేషన్ సెట్ కావడం అంత తేలిక కాదని ఆమె చెప్పారు.

ఎవరైనా ఒక్క గంట లేట్ చేసినా లక్షల్లో వృథా ఖర్చు తేలుతుందని.. అందుకే పీరియడ్స్ టైంలో పెయిన్ కిల్లర్స్ తీసుకుని మరీ షూటింగ్‌కు వెళ్లేవాళ్లమని ఈషా రెబ్బ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీరియడ్స్ గురించి అందరూ అర్ధం చేసుకోరని, కొందరు అబ్బాయిలకే అలాంటి మంచి మనసు ఉంటుందని ఈషా చెప్పారు. ఓ రోజున దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఇదే విషయం చెప్పగా.. ఆయన రెస్ట్ తీసుకోమని చెప్పారని వెల్లడించారు.
మొన్నామధ్య అరవింద సమేతలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని చెప్పి.. అందులో మీరు ఒకరు అని త్రివిక్రమ్ అన్నారని ఈషా రెబ్బ వెల్లడించారు. షూటింగ్ జరిగినన్నీ రోజులు చాలా హ్యాపీగా ఉందని, సరిగ్గా ఆ మూవీ రిలీజ్‌కు ముందు తనను సెకండ్ లీడ్‌గా అనౌన్స్ చేయడంతో చాలా బాధపడ్డానని.. కొన్ని సీన్స్ ఎడిటింగ్‌లో తీసేశారని, ఎన్టీఆర్‌తో పాట ఉంటుందని చెప్పి అది కూడా తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎన్టీఆర్- త్రివిక్రమ్‌లతో కలిసి పనిచేయడం ఒక్కటే ఊరట అని ఈషా చెప్పింది. కానీ పరోక్షంగా హీరోయిన్ ఛాన్స్ అని తనని మోసం చేశారని ఆమె ఇండైరెక్ట్ కామెంట్స్ చేసింది. అప్పట్లో ఈషా రెబ్బ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె కాదు ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఈ పరిస్ధితిని ఎదుర్కొన్నారని నెటిజన్లు కామెంట్స్ కూడా పెట్టారు.
కాగా.. ఈషా రెబ్బ కొత్తగా ఏ సినిమాకు కమిట్ అయినట్లుగా తెలియడం లేదు. చివరిసారిగా గతేడాది మామా మచ్చీంద్రలో ఆమె నటించినా అది అంతగా వర్కవుట్ కాలేదు. ఇదిలాఉండగా ఈషా రెబ్బా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మిర్రర్‌ను చెక్ చేస్తున్నానంటూ సెల్ఫీ దిగి వాటిని పోస్ట్ చేసింది ఇషా రెబ్బ. ఎద అందాలు చూపిస్తూ, షార్ట్ మిడ్డీలో చూపులతో మత్తెక్కిస్తోన్న ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











