ఎద అందాలతో ఈషా రెబ్బా హాట్ ట్రీట్.. పద్దతిగా కనిపిస్తూనే కాక రేపుతోందిగా!
ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిలు కూడా అందాల ఆరబోయడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. గత కొన్నాళ్లుగా సరైన సినిమా ఆఫర్ లేక ఇబ్బంది పడుతున్న ఈషా రెబ్బా ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ ఫోటోల్లో ఆమె ఎద అందాలు ఆరబోస్తూ కనిపిస్తోంది. ఇక దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

ఎంబీఏ పూర్తి చేసి
ఈషా రెబ్బ వరంగల్ లో జన్మించింది. తర్వాత తల్లిదండ్రుల ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్లోనే పెరిగింది. ఆమె ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఆమెకు సినీ అవకాశాలు రావడం మొదలయ్యాయి. నిజానికి చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ చేస్తున్న సమయంలో ఆమె లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చేసిన అంతకుముందు ఆ తర్వాత అనే సినిమా ఆమెకు మంచి పేరు తీసుకు వచ్చింది.

హిట్ అయినా
అయితే సినిమా హిట్ అయినా సరే ఆమెకు అవకాశాలు మాత్రం వెంటనే దొరకలేదు. ఆ తర్వాత బందిపోటు అనే సినిమాలో ఆమె ఒక ఆసక్తికర పాత్రలో నటించింది. ఆ తర్వాత ఓయ్ అనే తమిళ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలు కూడా ఆమెకు కలిసి రాలేదు. తర్వాత అమీతుమీ, మాయ మాల్ దర్శకుడు వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత నాని నిర్మాణంలో తెరకెక్కిన 'ఆ' సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

డిజాస్టర్ గా
ఆ తర్వాత బ్రాండ్ బాబు అనే సినిమాలో నటించినా ఆ సినిమా కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. అయితే అరవింద సమేత వీర రాఘవ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన సుబ్రహ్మణ్యపురం అనే సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటించి మరో హిట్ అందుకుంది. తర్వాత రాగల 24 గంటల్లో సినిమా మళ్లీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక పిట్టకథలు అనే ఒక నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ లో కూడా ఆమె ఆకట్టుకుంది.

సినీ అవకాశాల కోసం
చివరిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో హిట్టు కొట్టిన ఆమె ఆ సినిమాలో కేవలం చిన్న పాత్రకే పరిమితం అయింది. ప్రస్తుతానికి ఆమె ఒట్టు అనే ఒక మలయాళం సినిమా చేస్తోంది. అలాగే మరో తమిళ సినిమా కూడా చేస్తోంది. ఇక త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చిన ఈ భామ ఇప్పుడు వరుస సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది.

ఎద అందాలు షేర్ చేస్తూ
అందులో భాగంగానే ఎప్పటికప్పుడు తన అద్భుతమైన ఫోటోలను షేర్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. తాజాగా ఆమె సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూనే హాట్ షోకి తెరలేపింది. అందులో భాగంగా ఆమె తన ఫోటోలు షేర్ చేయడమే కాక సే సంథింగ్ అంటే ఏదైనా చెప్పండి అంటూ కామెంట్ పెట్టింది. దానికి శివాత్మిక రాజశేఖర్ అందం మాక్స్ అని అనగా ప్రియాంక జవాల్కర్ సంథింగ్ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈషా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం దాని మీద మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.


Click it and Unblock the Notifications











