ఇండస్ట్రీలో అలాంటి వారు ఉన్నారు: కాస్టింగ్ కౌచ్ గురించి ఈషా రెబ్బ

సినిమా ఇండస్ట్రీలో యాక్ట్రెస్ అంటే కొంచెం చిన్నచూపు ఉన్నమాట నిజమే అని నటి ఈషా రెబ్బ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో నెగెటివ్, పాజిటివ్ ఉన్నట్లే సినిమా ఇండస్ట్రీలో కూడా నెగెటివ్, పాజిటివ్స్ ఉన్నాయని తెలిపారు. సినిమా పరిశ్రమలో ఉన్నవారంతా చెడ్డవారు కాదు. కొందరు అలాంటి వారు ఉంటారు. వారి వల్లే ఇండస్ట్రీపై మచ్చ పడిందన్నారు.

సినిమా ఇండస్ట్రీలో చాలా డిసిప్లిన్, సివిలైజ్డ్, ఎడ్యుకేటెడ్, రెస్పెక్ట్ ఇచ్చే పీపుల్ కూడా ఉన్నారు. కొందరు నెగెటివ్‌గా ప్రవర్తించేవారు ఉన్నారు. మీ గురించి మీకు క్లారిటీ ఉంటే మిమ్మల్ని ఎవరూ మానిప్యులేట్ చేయలేరని ఈషా చెప్పుకొచ్చారు.

Eesha Rebba speaks about casting couch

కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని చోట్ల ఉంది. సినిమా రంగంలో ఇది లేదు అనడం లేదు. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది ముఖ్యం. ఎవరూ ఏమీ తెలియకుండా ఇండస్ట్రీకి రారు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలిసే వస్తారు. ఇండస్ట్రీలో ఏదైనా సరే ఇంత జరిగితే అంత చూపిస్తారని ఇషా రెబ్బ వెల్లడించారు.

నాకు కూడా కొన్ని కాస్టింగ్ కౌచ్ సంఘటనలు ఎదురయ్యాయి. నా వేలో వాటిని హ్యాండిల్ చేశాను.వారిలో అలాంటి ఉద్దేశ్యం ఉంటే వెంటనే మనకు తెలిసిపోతుంది. ఆ సమయంలో మనం గట్ ఫీలింగ్‌తో రిజక్ట్ చేయాలని ఈషా రెబ్బ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X