అందరిలా కాదు కానీ అందంతో ఆకట్టుకుంటా! ఈషా రూటే సెపరేటు
తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ హీరోయిన్లు కనిపించడం చాలా అరుదు. అప్పట్లో ఇక్కడి వాళ్లనే హీరోయిన్లుగా తీసుకున్న సినీ నిర్మాతలు.. ఇప్పుడు మాత్రం వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో వెండితెరపై తెలుగు హీరోయిన్ల మెరుపులు కరువయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైతం పోటీని తట్టుకుని నెట్టుకు వస్తోంది ఈషా రెబ్బా.
'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఈషా రెబ్బ.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సక్సెస్ కాలేకపోతోంది. అందం, టాలెంట్ ఉన్నా ఈ హాట్ బ్యూటీకి అవకాశాలు దొరకడం లేదు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత.. వీరరాఘవ'లో అవకాశం వచ్చినా.. ఆ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ పడ్డారు. అయినప్పటికీ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయిన్ చాలా ఎక్కువే.

ఈ నేపథ్యంలో తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా నిత్యం టచ్ లోనే ఉంటుంది ఈషా. ఎప్పటికప్పుడు తన విశేషాలు చెబుతూ, ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ హంగామా చేస్తుంటుంది. హీరోయిన్ అన్నాక కాస్తయినా హాట్‌నెస్ ఒలకబోయాలి కాబట్టి కొంతమేర హాట్ లుక్స్ పోస్ట్ చేస్తుంది. కానీ అందరు హీరోయిన్స్‌లా బికినీ, క్లీవేజ్ లుక్స్ మాత్రం ఉండవు. ఈ నేపథ్యంలోనే తాజాగా తన లేటెస్ట్ ఫోటో షూట్ పంచుకున్న ఈషా రెబ్బా నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఈ ఫొటోల్లో ఈషా లుక్స్ చూసి హీరోయిన్ అంటే ఈమె. హీరోయిన్ అంటే ఈ తెలుగమ్మాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇకనైనా ఆమె సినిమాల జోరు సాగుతుందేమో అని ఆశగా ఉన్నారు ఈషా ఫ్యాన్స్.


Click it and Unblock the Notifications











