ఇషా రెబ్బ ఐటమ్.. క్రేజీ రెమ్యునరేషన్.. బన్నీతో బంపర్ ఆఫర్..
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాల ఫలితాలు చూస్తే అర్థం అవుతుంది. రెండు సూపర్ హిట్‌ల తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న చిత్రమే 'అల.. వైకుంఠపురములో'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలెట్టేసింది. ఈ నేపథ్యంలో తాజాగా బయటకు వచ్చిన ఓ న్యూస్.. సినిమాపై క్రేజ్‌ను అమాంతం పెంచేస్తోంది. ఇంతకీ ఏంటా న్యూస్.? వివరాల్లోకి వెళితే..

భారీ కాస్టింగ్.. హై ఎమోషనల్ కంటెంట్
‘అల.. వైకుంఠపురములో' సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అంతేకాదు, ఇందులో మురళీ శర్మ, రావు రమేష్, టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్ తదితర నటులు యాక్ట్ చేస్తున్నారు. ఇందులో అందరూ పేరు మోసిన ఆర్టిస్టులే ఉన్నారు. అలాగే, ఈ సినిమా ఫుల్ ఎమోషనల్‌గా సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన్న విషయం తెలిసిందే.
Recommended Video

అన్నింటినీ బాగా రిసీవ్ చేసుకున్నారు
ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యంగా ‘సామజవరగమన' అంటూ సాగే పాట రికార్డులు మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. అలాగే, ‘రాములో రాములా'కు కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.

ఎవరూ ఊహించని రీతిలో..
తాజాగా ‘అల.. వైకుంఠపురములో' సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందనేదే ఆ వార్త సారాంశం. అది కూడా ‘సన్నాఫ్ సత్యమూర్తి'లో ‘సూపర్ మచ్చీ', ‘కింగ్'లో ‘తరరంపంపం' అని సాగే పాటల్లా ఫ్యామిలీ అంతా కలిసి డ్యాన్స్ చేస్తారని అంటున్నారు.

తెలుగమ్మాయిని తీసుకున్నారట
ఈ స్పెషల్ సాంగ్ కోసం తెలుగమ్మాయి ఇషా రెబ్బాను తీసుకుంటున్నారని కూడా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈమె ‘రాగల 24 గంటల్లో' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాను ప్రేక్షకులు అంతగా రిసీవ్ చేసుకోలేదు. ఫలితంగా ఈ అమ్మాయి ఖాతాలో మరో ఫ్లాప్ వచ్చి చేరింది.

ఐదు నిమిషాలకే భారీ మొత్తం
ఇషా రెబ్బా ప్రస్తుతం సరైన హిట్ లేక బాధ పడుతోంది. ఆమె ఏం చేసినా ఫలితం మాత్రం నిరాశజనకంగానే ఉంటోంది. అయితే, బన్నీ సినిమాలో వచ్చిన ఆఫర్ ఆమెకు ప్లస్ అయ్యేలానే ఉంది. దీనికి కారణం.. ఐదు నిమిషాల పాట కోసం ఈషాకు రూ. 20 లక్షలు వరకు ఇస్తున్నారట నిర్మాతలు. ఇదే నిజమైతే అమ్మడి పంట పండినట్లే.


Click it and Unblock the Notifications











