మొత్తానికి ట్విట్టర్ అకౌంట్ సెట్టైంది.. ఆనందంలో ఈషా రెబ్బా
సోషల్ మీడియాలో సెలెబ్రిటీలకు తరుచూ ఓ సమస్య ఏర్పడుతూనే ఉంటుంది. నిత్యం ఎవరోకరి సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవుతూ ఉంటాయి. ఆ మధ్య పూజా హెగ్డే, స్మిత వంటి వారు ఖాతాలు దుండగుల చేతికి వెళ్లాయి. తాజాగా అందమైన చందమామ ఈషారెబ్బా ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. ఈ మేరకు రెండ్రోజుల క్రితమే తన ఫాలోవర్స్‌ను హెచ్చరించింది. తాజాగా ఆమె ట్విట్టర్ ఖాతా తన అధీనంలోకి వచ్చిందని చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈషా రెబ్బా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుంది. అచ్చమైన పదహారణాల తెలుగు అందాలను నెటిజన్లకు పరిచయం చేసే విధంగా ఫోటోలను షేర్ చేస్తూ.. అందర్నీ ఆకట్టుకుంది ఈషా. ఇక తాజాగా రెండ్రోజుల క్రితం తన ట్విట్టర్ ఖాతాలో సమస్య ఏర్పడిందని ఈషా చెప్పుకొచ్చింది. హాయ్ ఫ్రెండ్స్.. ట్విట్టర్ ఖాతాలో ఏదో సమస్య వచ్చినట్టు తెలుస్తోంది. ఏదైనా తప్పుడు సందేశాలు, ట్వీట్స్ వస్తే మన్నించండి..అంటూ చెప్పుకొచ్చింది.

ఇక తాజాగా తన ట్విట్టర్ ఖాతా సమస్య తీరిపోయిందని ఆనందం వ్యక్తం చేస్తూ ఈషా ట్వీట్ చేసింది. 'హలో ఫ్రెండ్స్ .. హలో ఫ్రెండ్స్, నా ట్విట్టర్ అకౌంట్ స్వీయ నిర్భంధం నుండి తిరిగి వచ్చింది. ఇప్పుడు ఇది సేఫ్‌గాను, సెక్యూర్‌గాను , మరింత రక్షించబడేలా ఉంటుంది. నా అకౌంట్‌ని తిరిగి తీసుకొచ్చినందుకు నా బృందానికి ధన్యవాదాలు. మీరు నన్ను మిస్ అయ్యారా?'అంటూ అడిగింది. ఇక ఈషా ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ అనే క్రేజీ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











