Jacqueline Fernandez మెడకు బిగిసిన ఈడీ ఉచ్చు.. 215 కోట్ల కుంభకోణంలో చార్జిషీట్?

బాలీవుడ్ నటి జాక్వలైన్ ఫెర్నాండెజ్ భారీ కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయింది. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడిన వ్యవహారంలో కరడు గట్టిన నేరస్థుడు సుకేష్ చంద్రశేఖర్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు ఈడీ విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో జాక్వలైన్ ఫెర్నాండేజ్‌పై చార్జిషీట్ దాఖలు వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

సుకేష్ బలవంతపు వసూళ్ల కేసు

సుకేష్ బలవంతపు వసూళ్ల కేసు


తమిళనాడుకు చెందిన సుకేష్ చంద్రశేఖర్ గతంలో పలు నేరాల్లో నిందితుడుగా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. గతంలో రాన్ బాక్సీ ప్రమోటర్లను బలవంతపు వసూళ్లకు పాల్పడిన కేసులో సుకేష్‌ను అరెస్ట్ చేశారు. సుకేష్‌ చంద్రశేఖర్‌పై 215 కోట్ల మేర బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టు ఈడీ గుర్తించింది. ఈ కేసులో ఆయనను పలు మార్లు విచారించడం తెలిసిందే.

తీహార్ జైలు నుంచి అమిత్ షా పీఏ అంటూ

తీహార్ జైలు నుంచి అమిత్ షా పీఏ అంటూ

ఇదిలా ఉండగా, తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్‌ మరో దారుణమైన కుట్రకు పాల్పడ్డాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పీఏను అని చెప్పుకొని ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడటమే కాకుంా జైలు నుంచే బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. పెరోల్‌పై విడుదలైన సుకేష్ బాలీవుడ్ హీరోయిన్ జాక్వలైన్‌కు ప్రైవేట్ జెట్ పంపించి.. తమిళనాడుకు తీసుకెళ్లాడు. ఆమెతో రాసలీలకు పాల్పడినట్టు ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

జాక్వలైన్‌తో సుకేష్ సంబంధాలు

జాక్వలైన్‌తో సుకేష్ సంబంధాలు

సుకేష్ చంద్రశేఖర్‌ గురించి ఈడీ అధికారులు ఆరా తీస్తుండటంతో జాక్వలైన్ ఫెర్నాండేజ్ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ కేసులో పలుమార్లు ఆమెను అధికారులు విచారించారు. సుకేష్ చంద్రశేఖర్ బలవంతపు వసూళ్ల కేసులో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఈడీ గుర్తించింది. జాక్వలైన్‌కు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేయడం ఇటీవల సంచలనంగా మారింది.

జాక్వలైన్‌కు భారీగా గిఫ్టులు

జాక్వలైన్‌కు భారీగా గిఫ్టులు


సుకేష్ చంద్రశేఖర్‌తో రిలేషన్‌షిప్ కొనసాగించడం మీడియాలో చర్చనీయాంశమైంది. జాక్వలైన్‌కు భారీగా ధనం వెచ్చించి.. ముంబైలో సముద్రానికి అభిముఖంగా ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను జాక్వలైన్‌కు సుకేష్ ఇవ్వడం కూడా భారీ చర్చకు దారి తీసింది. జాక్వలైన్, సుకేష్‌కు సంబంధించిన సన్నిహితంగా, ముద్దులు పెట్టుకొంటూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిద్దరి మధ్య సంబంధాలకు ఆధారాలు లభించాయి.

జాక్వలైన్‌పై ఈడీ చార్జిషీట్

జాక్వలైన్‌పై ఈడీ చార్జిషీట్


సుకేష్ చంద్రశేఖర్‌తో జాక్వలైన్‌కు ఆర్థిక సంబంధాలు ఉన్నాయనే విషయం ఈడీ అధికారులు విచారణలో గుర్తించారు. సుకేష్ బలవంతపు వసూళ్ల నుంచి 10 కోట్ల మేర లబ్ది పొందినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. 7 కోట్ల విలువైన ఆస్తులను కూడా అటాచ్ చేశారు. ఈ క్రమంలో అధారాలు బలంగా ఉండటంతో జాక్వలైన్ ఫెర్నాండేజ్‌పై చార్జిషీట్ దాఖలు చేయడానికి సిద్దమవుతున్నట్టు ఈడీ వర్గాల సమాచారం. జాతీయ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది. దాంతో ఆమె పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.

విక్రాంత్ రోణ చిత్రంలో స్పెషల్ సాంగ్‌తో

విక్రాంత్ రోణ చిత్రంలో స్పెషల్ సాంగ్‌తో

జాక్వలైన్ ఫెర్నాండేజ్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల సుదీప కిచ్చ నటించిన విక్రాంత్ రోణ సినిమాలో జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ సాంగ్‌లో అదరగొట్టింది. రాకమ్మా రాకమ్మ అనే పాటలో ఆమె అద్భుతంగా స్టెప్పులేసింది. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో వైరల్ అవుతున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X