ఐదు నెలలు వేచి చూశా.. ఆ ఫీలింగ్ కలుగలేదు.. మెహ్రీన్ ఫిర్జాదా
ఆదిత్య మ్యూజిక్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్, శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పించగా ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాతలుగా సతీష్ వేజేశ్న దర్శకత్వం వహించిన ఎంత మంచివాడవురా చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నది. నందమూరి కల్యాణ్ రామ్, మెహ్రీన్ పిర్జాదా జంటగా నటిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీత దర్శకత్వం వహించారు. రాజు తోట కెమెరా, తమ్మి రాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా మాట్లాడుతూ..

ఎన్టీఆర్‌కు థ్యాంక్స్
ప్రేక్షకులు, అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్టీఆర్‌కు, నిర్మాత దిల్ రాజుకు నా థ్యాంక్స్. ఎంత మంచివాడవురా సినిమా టైటిలే కాదు. ఈ చిత్ర యూనిట్‌లో ప్రతీ ఒక్కరిని చూస్తే ఎంత మంచి వాళ్లురా అని అనాలి అనిపిస్తుంది అని మెహ్రీన్ అన్నారు.

ఐదు నెలలు వేచి చూశా
F2 సినిమా తర్వాత ఐదు నెలలు వేచి చూశాను. మంచి పాత్ర పోషించాలని చాలా సినిమాలు వదులుకొన్నాను. చివరకు ఎంత మంచి వాడవురా సినిమాలో నందు పాత్ర లభించింది. ఈ చిత్రంలో నా పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇంత మంచి పాత్రను ఇచ్చిన నిర్మాతలకు, దర్శకులకు నా ధన్యవాదాలు అని మెహ్రీన్ అన్నారు.

ఫ్యామిలీలో ప్రతీ ఒక్కరికి
దర్శకుడు సతీష్ వెజ్నేశ కథ చెప్పినప్పుడే సినిమా బాగా నచ్చింది. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు సినిమా చేస్తున్నాననే ఫీలింగ్ కలుగలేదు. ఓ కుటుంబంతో గడిపాననే భావన కలిగింది. ఇది ఫ్యామిలీ సినిమా. ప్రతీ ఒక్కరికి నచ్చుతుంది. ఫ్యామిలీలో ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అని మెహ్రీన్ అన్నారు.


Click it and Unblock the Notifications











