సౌత్ సినిమాల్లో ప్యాడింగ్స్ పెట్టారు..చాలా అవమానంగా అనిపించేది.. హీరోయిన్ కామెంట్స్ వైరల్
సినిమా అవకాశాల కోసం పరితపించడం అలా అవకాశాలు వచ్చి ఒకటీ అరా సినిమాలు చేసిన తర్వాత గుర్తింపు రాక పోవడంతో ఆయా సినీ దర్శకనిర్మాతలు, హీరోల మీద కామెంట్లు చేస్తున్నారు కొందరు. తాజాగా సౌత్ లో హీరోయిన్ గా కొన్ని సినిమాలు ఒకరు ఏకంగా సౌత్ ఇండస్ట్రీ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

సంచలన వ్యాఖ్యలు
ముంబై భామ ఎరికా ఫెర్నాండెజ్ 2010, 2011లో వరుసగా పాంటలూన్స్ ఫెమినా మిస్ ఫ్రెష్ ఫేస్, పాంటలూన్స్ ఫెమినా మిస్ మహారాష్ట్రతో పాటు పలు టైటిల్ను గెలుచుకుంది. ఆ తర్వాత మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె బుల్లితెర నటిగా కూడా ఎంట్రీ ఇచ్చి లక్ పరీక్షించుకుంది. అక్కడ సక్సెస్ అయిన తరువాత వెండి తెర మీద ఫోకస్ పెట్టింది.

సంచలన వ్యాఖ్యలు
మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిఉంది ముంబై భామ ఎరికా ఫెర్నాండెజ్. తమిళ సినిమాతో తెరంగ్రేటం చేసిన ఆమె ఆ తర్వాత తెలుగు సహా కన్నడ భాషలో కూడా నటించింది. తెలుగులో గాలిపటం, డేగ మూవీస్‌లో కనిపించి టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. చివరిగా 2017లో తమిళ సినిమా చేసి సినిమాలకు ఈ భామ దూరమైంది. అయితే ఆమె తాజాగా ఈ నటి సౌత్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

లావుగా కనిపించేందుకు
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటిస్తున్న తనకు అవమానాలు ఎదురయ్యాయని ఆమె పేర్కొంది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు ఆమె పంచుకుంది. తాను హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో 'అప్పట్లో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో బొద్దుగా ఉండే హీరోయిన్లనే ఎక్కువగా తీసుకునేవారు. కానీ నేనేమో సన్నగా ఉండేదాన్ని. అందుకే తెరపై కొంచెం లావుగా కనిపించేందుకు నా శరీరంపై ప్యాడ్స్ పెట్టి మేనేజ్ చేయడానికి ప్రయత్నించారని ఆమె వెల్లడించింది.

అవమానంగా, అసౌకర్యంగా
అక్కడి వారు అలా చేస్తుంటే నాకు సిగ్గుగా అనిపించేదని, చాలా అవమానంగా, అసౌకర్యంగా ఫీలయ్యే దాన్ని అని ఆమె బయట పెట్టింది. అలా ప్యాడ్స్ పెట్టుకుని నటించేందుకు ఎంతో ఇబ్బంది పడేదాన్నని పేర్కొన్న ఆమె దర్శకనిర్మాతలు కోరుకున్నట్లు నేనే లేనేమోనని నాలో నేను మదన పడేదాన్ని అని చెప్పుకొచ్చింది. అయితే అయితే అదృష్టవశాత్తూ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని, ఇప్పుడు సన్నగా ఉన్న వారికి కూడా సినిమా అవకాశాలు వస్తున్నాయని ఆమె పేర్కొంది.

అందాల ఆరబోత
అయితే సినిమాలు ఆపేసిన ఆమె 'కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ' అనే హిందీ సీరియల్ చేయడం మొదలు పెట్టింది. అలా మొదలు పెట్టిన ఆమె ప్రస్తుతం సీరియల్స్ తో చాలా బిజీగా ఉంది. ఈ అమ్మడికి ప్రస్తుతం సినిమా అవకాశాలు లేవు కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటుంది. బక్క పలుచగా ఉన్నా.. అందాల ఆరబోతలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని అంటూ రకరకాల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. ఆమె కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.


Click it and Unblock the Notifications











