ఆ క్రికెటర్ తో రొమాంటిక్ రిలేషన్.. డేటింగ్, బ్రేకప్ పై యంగ్ హీరోయిన్
ఇండియాలో క్రికెటర్లు, సినీనటులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ ఒక మతమైతే క్రికెటర్లు దేవుళ్లు.. సినీనటులను దైవంలా ఆరాధిస్తారు అభిమానులు. అందుకే స్టార్స్ చాలామందితో క్రికెటర్ల ఎఫైర్లు, డేటింగ్స్, పెళ్లిళ్లు జరిగాయి. షర్మిళా ఠాగూర్ - టైగర్ పటౌడీ నుంచి విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ వరకు ఎంతోమంది క్రికెటర్లు, హీరోయిన్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నేటికీ క్రికెటర్లు - బాలీవుడ్ హీరోయిన్ల మధ్య లింక్‌లు వస్తూనే ఉన్నాయి.
శుభమన్ గిల్‌తో ప్రగ్యా జైస్వాల్ డేటింగ్?
కొద్దినెలల క్రితం టీమిండియా క్రికెటర్ శుభమన్ గిల్- హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మధ్య ఏదో యవ్వారం నడుస్తుందంటూ బీటౌన్ మీడియా లింకులు పెట్టింది. అయితే ఇద్దరి మధ్యా ఎలాంటి రిలేషన్ లేదని, గిల్‌తో ఎఫైర్ నడిపే అవకాశం వస్తే వదలుకోనని తేల్చి చెప్పింది. ఆ వెంటనే మరో టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కి బాలీవుడ్ దిగ్గజ నేపథ్య గాయనీ ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేలు డేటింగ్‌లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిని వీరిద్దరూ ఖండించారు. తాజాగా టీమిండియా ఆల్ రౌండర్.. నటి ఈషా గుప్తా మధ్య రిలేషన్ నడుస్తున్నట్లుగా బీటౌన్ మీడియా కోడై కూసింది.

వివాదాలతో ఈషా గుప్తా
సినిమాల కంటే వివాదాలతోనే వార్తల్లో ఉంటారు ఈషా గుప్తా. టాప్ మోడల్‌గా రాణించిన ఈషా గుప్తా.. చక్రవ్యూహ్, హంసకళ, రాజ్ 3డీ, రుస్తుం, బాద్‌షాహో సినిమాలతో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్య సినిమాలపై అంతగా ఫోకస్ పెట్టినట్లుగా కనిపించడం లేదు. 2019లో వన్ డే: జస్టిస్ డెలివర్డ్ మూవీలో డీసీపీగా పవర్‌ఫుల్ యాక్టింగ్ చూపించిన ఈషా గుప్తా దాదాపు ఆరేళ్లుగా ఖాళీగానే ఉన్నారు. ప్రస్తుతం దేశి మేజిక్ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అలాగే కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ ఈషా నటిస్తున్నారు.
హార్దిక్ పాండ్యాతో ఈషా గుప్తా డేటింగ్?
భార్య నటాషాకు విడాకులిచ్చి ఒంటరిగా ఉన్న టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో ఈషా గుప్తా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా సిద్ధార్ధ్ కన్నన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ఈషా స్పందించారు. కొన్నిరోజులు మేమిద్దరం మాట్లాడుకున్నామని.. డేటింగ్‌లో ఉన్నామని అనుకోవట్లేదని ఆమె అన్నారు. పరిచయం కలిగినప్పుడే డేటింగ్‌లోకి వెళ్లే అవకాశాలు ఉండవని ఇద్దరం ముందే ఫిక్స్ అయ్యామని ఈష తెలిపారు. రిలేషన్‌లోకి అడుగుపెట్టకుండానే మా దారులు వేరయ్యాయన్నారు.
మాది డేటింగే కాదు
నా దృష్టిలో అది డేటింగ్ కాదని.. రెండు మూడు సార్లు కలుసుకున్నామని, ఇది రెండు నెలల తర్వాత ముగిసిపోయిందని ఈషా గుప్తా చెప్పారు. నిజంగానే వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. అనుకున్నామని అన్ని విషయాలు ముందుకు సాగలేదని వ్యాఖ్యానించారు. టైం అనేది ఒకటి ఉంటుందని.. అలాగని ఇద్దరి మధ్యా ఎలాంటి గొడవలు జరగలేదని ఈషా గుప్తా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చనీయాంశం అవ్వగా.. హార్దిక్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











