ఆ సినిమాలో ఇషా రెబ్బ ఐటమ్ సాంగ్.. ఎందుకు వర్కవుట్ కాలేదంటే?
అచ్చ తెలుగు అందం ఇషా రెబ్బ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సి సరైన హిట్ పడక అమ్మడు ఇంకా అవకాశాల ఎదురుచూస్తుంది కానీ, ఆమె అందం, అభినయానికి ఈపాటికి స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది. అంతకు ముందు.. ఆ తరువాత అనేసినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది ఇషా. ఈ సినిమా విజయాన్ని అందుకున్నా .. అమ్మడికి మాత్రం సరైన గుర్తింపును తీసుకురాలేదు. దీని తరువాత బందిపోటు, అమీ తుమీ, అ! నటించింది. అవి కూడా ఆమెకు విజయాన్ని అందించలేకపోయాయి.
ఇక అరవింద సమేత రాఘవ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. త్రివిక్రమ్ సినిమాల్లో మొదటి హీరోయిన్ కన్నా..రెండో హీరోయినే అదిరిపోతోంది. అలా పూజా హెగ్డే కన్నా ఇషా రెబ్బనే మంచి పేరుతెచ్చుకుంది. ఈ సినిమా హిట్అందుకోవడంతో ఇషాకు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సెస్ వస్తాయిఅనుకున్నారు . కానీ,అమ్మడి లక్.. ఒక్క సినిమా కూడా మంచి గుర్తింపునుతీసుకురాలేకపోయింది. అడపాదడపా సినిమాలు చేస్తున్న ఇషా.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు ఉంటుంది.

చీరకడితే పదహారణాల తెలుగు అందం.. మోడ్రన్ డ్రెస్ వేస్తే హాలీవుడ్ మోడల్ కు ఏ మాత్రం తీసిపోకుండా ఉండే అందం.. ఆమె సొంతం . ఇక ఇషా తాజాగా ఆఫర్ ను వదులుకున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ సైతం ఐటెంసాంగ్స్ చేసి ప్రేక్షకులనుమెప్పిస్తున్నారు . సమంత, తమన్నా, రెజీనా, కాజల్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఇక ఆ లిస్ట్ లోకి ఇషా కూడా చేరింది.
అంటే అన్ని బావుంటే.. ఇప్పుడు ఇషా పేరు మోత మోగిపోయేది. కానీ, ఇక్కడ కూడా ఇషాకు బ్యాడ్ లక్కే ఎదురయ్యింది. విశ్వక్ సేన్, నేహా శెట్టిజంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎన్నో అడ్డంకులను దాటుకొని మే 31 న ప్రేక్షకుల ముందుకురానుంది .

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైనట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగాఆకట్టుకున్నాయి . ఇక ఈ సినిమాలో ఐటెంసాంగ్ మోత మోగిపోద్ది ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ ఐటెంసాంగ్ ను మొదట ఇషా రెబ్బచేయాల్సి ఉందట. ఆ సాంగ్ కు ఆమె కూడా ఒప్పుకొని షూటింగ్ కూడామొదలుపెట్టాక .. ఇషా అనారోగ్యం పాలవ్వడంతో ఆమె ప్లేస్ లో హాట్ బ్యూటీ అయేషా ఖాన్ ను తీసుకున్నారట. అలా ఆ ఛాన్స్ ను ఇషా మిస్ చేసుకోవాల్సివచ్చింది .
ఒకవేళ ఈ సాంగ్ కనుక ఈ ముద్దుగుమ్మ చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇషా వీమంచి అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. తమిళ్ లో ఈ మధ్యనే ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా అమ్మడు తన లక్ ను పరీక్షించుకోవడం మొదలుపెట్టింది. మరి ముందు ముందు అయినా ఈ ముద్దుగుమ్మ మంచి విజయాలను అందుకుంటుందేమో చూడాలి .


Click it and Unblock the Notifications











