16 రోజుల కాపురం.. అందుకే విడాకులు.. నోయెల్‌తో డైవోర్స్‌పై ఎస్తేరా సంచలన వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీలో నటులు, నటీమణులు సినిమాల ద్వారా డబ్బు,పేరు సంపాదించుకుంటారు. కానీ, కొంతమంది మాత్రం తమ వ్యక్తిగత జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారు. ప్రధానంగా పెళ్లి, విడాకుల విషయంలో సెలబ్రెటీలు ఎప్పడూ వార్తల్లో నిలుస్తున్నారు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారో.. ఎప్పుడూ విడిపోతున్నారో కూడా తెలియడం లేదు. చిన్నచిన్న కారణాలతో తమ వివాహ బంధాన్ని తెంచుకుంటున్నారు. అలా.. ఓ స్టార్ కపుల్ పెళ్లి చేసుకున్న ఆరు నెలల్లోనే వీరు విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఆ కపుల్ ఎవరో ఓ లూక్కేయండి.
ఆ స్టార్ కపుల్స్ ఎవరో కాదు. టాలీవుడ్ నటి ఎస్తర్ నోరోన్హ- బిగ్ బాస్ ఫేమ్, సింగర్ నోయల్. టాలీవుడ్ నటి ఎస్తర్ నోరోన్హ విషయానికి వస్తే.. పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన 'వేయి అబద్ధాలు' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. కానీ, ఈ మూవీలో ఈ అమ్మడుకు అంత గుర్తింపు రాలేదు. ఆ తరువాత 'భీమవరం బుల్లోడు'సినిమాలో నటించి ఫర్వాలేదని పిలిచింది ఎస్తర్ నోరోన్హ. కానీ, ఆమె అనుకున్న స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. ఆ తరువాత 'జయ జయ జానకి నాయక'లో ఓ చిన్న పాత్ర చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

ఈ క్రమంలో సింగర్ నోయల్‌ను ప్రేమించి, పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే.. ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లి చేసుకున్న ఆరు నెలల్లోనే వీరు విడాకులు తీసుకుని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. విడాకుల తర్వాత ఎస్తర్ ఎలాగైనా సినిమా ఆఫర్ అందుకోవాలని ప్రయత్నించింది. అందాల ఆరబోతకు,రోమాంటిక్ సీన్లలో నటించేందుకు వెనుకాడలేదు. ఈ క్రమంలోనే 69 సంస్కార్ కాలనీ, రెక్కీ సినిమాలలో తన గ్లామర్ షోతో పిచ్చేక్కించింది. సినిమాల కంటే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ అమ్మడు తన లేటెస్ట్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ కు దగ్గరగానే ఉంటుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ ఎస్తేర్ మాట్లాడుతూ.. నోయెల్‌తో ప్రేమ,పెళ్లి, విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను పెళ్లయ్యాక ఆరు నెలల్లో కేవలం 16 రోజులు మాత్రమే కలిసి ఉన్నామని, ఆ 16 రోజుల్లోనే నోయల్ క్యారెక్టర్ ఏంటో తనకి పూర్తిగా అర్థమైందని హీరోయిన్ ఎస్తర్ నోరోన్హ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ ఆరు నెలల్లో ఎన్నోసార్లు తమ బంధంగురించి ప్రస్తావించామని, కానీ, ఫలితం లేకపోవడంతో .. తానే విడాకులు తీసుకుందామనే నిర్ణయం తీసుకున్నాన్నారు. తమ వివాహ బంధంలో కొట్టుకోవడం గాని తిట్టుకోవడం గాని జరగలేదని, అలా జరిగి ఉన్న ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ తెలిసి ఉండేదని అన్నారు. గొడవ కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అని, ఇద్దరి మధ్య ప్రేమ ఉంటేనే గొడవ పెట్టుకుంటారంటూ హీరోయిన్ ఎస్తర్ నోరోన్హ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది.
అయితే.. సిల్లీ రీసన్స్ తోనే డైవర్స్ తీసుకున్నారా అని యాంకర్ ప్రశ్నించగా..' లేదు సిల్లీ రీసన్స్ అనే విషయం కాదు సీరియస్ విషయాలను కూడా సిల్లీగా ట్రీట్ చేశాడు నోయల్. జీవితాన్ని కూడా గేమ్ లాగా చూశాడు. నా పేరెంట్స్ చీప్ గా చూశాను. జీవితంలో ప్రతి ఒక్కటి బిగ్ బాస్ లాంటి షో కాదు. పెళ్లి ఇస్ నాట్ ఏ జోక్. జీవితం గేమ్ కాదు. మనుషులతో ఆడుకోవడం కాదు. జీవితంలో ప్రతి విషయాన్ని సిల్లీగా తీసుకున్నాడు' అంటూ హీరోయిన్ ఎస్తర్ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఒక్కసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం జీవితాంతం కట్టుబడి ఉండాలని, అలాంటప్పుడు మాత్రమే మనపై ఇతరులకు ఒక నమ్మకం ఏర్పడుతుందన్నారు. నలుగురు ముందు మాట్లాడిన మాటలు కూడా .. వాస్తవం కాదంటూ నోయల్ మాట తప్పడం తనకు నచ్చలేదని, విడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని, ఆ కారణాలన్నీటిని సాక్షాధారాలతో సహా చూపించానన్నారు హీరోయిన్ ఎస్తర్ . నోయల్ తన తప్పులన్నిటిని అంగీకరించాడు కాబట్టే.. తమకు తొందరగా డైవర్స్ వచ్చాయని చెప్పుకొచ్చారు హీరోయిన్ ఎస్తర్ .నా విషయంలో నా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేయవచ్చు. కానీ కోర్టు సాక్షాలు లేకుండా.. దీనిని పరిగణలోకి తీసుకోరు కదా అంటూ హీరోయిన్ ఎస్తర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.


Click it and Unblock the Notifications











