‘టాప్ హీరోయిన్లూ బెడ్ సీన్స్‌లో ఘాటుగా... మమ్మల్ని అలా చూడొద్దు’

సునీల్ హీరోగా భీమవరం బుల్లోడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది ఎస్తేర్ నొరోన్హా .. ఆ తర్వాత గరం, జయ జానకి నాయక తదితర చిత్రాల్లో నటించింది. అందం, అభినయం ఉన్నప్పటికీ ఎస్తేర్‌కు ఎందుకో మంచి అవకాశాలు కానీ స్టార్ డమ్ కానీ దక్కలేదు. చివరికి సహాయక పాత్రలు, ఐటెం సాంగ్స్‌లోనూ నటించింది. ఒకదశలో హాట్ హాట్ సన్నివేశాల్లోనూ కనిపించి షాకిచ్చింది.

టాలీవుడ్ సింగర్ నోయెల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఎస్తేర్. అయితే ఆ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. వివాహం జరిగిన కొద్దిరోజులకే మనస్పర్థలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయారు. నాటి నుంచి ఎవరి జీవితం వారు సాగిస్తున్నారు. నోయెల్ తన సాంగ్స్, ఆల్బమ్స్, మ్యూజిక్ వీడియోలతో బిజీగా ఉంటుండగా.. ఎస్తేర్ మాత్రం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకెళ్తోంది. ఈ ఏడాది అమరావతికి ఆహ్వానం అనే సినిమాలో నటించింది. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్తేర్ తన కెరీర్‌, సినీ అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

Ester Noronha Opens Up About challenging Roles Career Struggles and Changing Perceptions in Cinema

నేను బోల్డ్ రోల్సే చేస్తానని జనాలు అనుకున్నారు. నేను పనిచేసే మనుషులు ఎలాంటి వారు, స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, కొత్తగా నేర్చుకోవడానికి ఏం ఉంటుంది, నాకు ఈ సినిమా చేయడం వల్ల ఏం లాభం వస్తుంది. నటిగా ఎంత ఎదగగలను అనేది చూస్తా. అమితాబ్ బచ్చన్‌ని ఇప్పటికీ యాంగ్రీ యంగ్‌మెన్ అంటూ ఉంటారు. ఆయన యాంగ్రీగా, యంగ్‌గా ఉన్నారా? అలాంటి ట్యాగ్స్ రావడం అనేది మనం చేసే పాత్రలను బట్టే ఉంటుంది. విద్యాబాలన్ గారికి బోల్డ్ యాక్టర్ అనే పేరుంది. ఇది ఒక గుర్తింపు. నన్ను బోల్డ్ యాక్టర్‌నే అనుకుని ప్రేక్షకులు అమరావతికి ఆహ్వానం అనే సినిమా హాల్‌లో కూర్చొంటే చాలు. ఆ సినిమానే వాళ్లను తీసుకెళ్తుంది అని ఎస్తేర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎస్తేర్ అంటే గుర్తింపు ఉంది, నేను ఉన్నానంటే ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేసి వస్తున్నారు. నేను ఏ కంటెంట్ ఇస్తున్నానో నాకు తెలియదు, వాళ్లకు తెలియదు. నేను చేసే జర్నీలో వాళ్లు నా గురించి అలా అనుకుంటున్నారు. ఫస్ట్ హీరోయిన్ హీరోయిన్ అని అనుకున్నారు.. ఆ సమయంలో ఆ పదాన్ని పాజిటివ్‌గా తీసుకోవచ్చు. కానీ చాలా లిమిటెడ్ ఉంది, కానీ నేను నెగిటివ్‌గా భావించా. ఆ హీరోయిన్ అనే ట్యాగ్ వల్ల నన్ను నేను నిరూపించుకోవడం కష్టమైంది. హీరోయిన్ అన్న సర్కిల్ దాటి నన్ను చూపించడానికి మేకర్స్ కూడా ట్రై చేయలేకపోయారు. దాంతో బొమ్మలా నిలబడే రోల్స్, అందంగా కనిపించే రోల్స్ వద్దు, నాకు ఛాలెంజింగ్ రోల్స్ కావాలని తీసుకున్నాక నన్ను రకరకాలుగా అనుకుంటున్నారు అని తెలిపారు.

దెయ్యం రోల్ చేస్తే నన్ను రియల్ లైఫ్‌లో కూడా దెయ్యం అనుకుంటారా? ఒక సినిమాలో రేపిస్ట్ రోల్ చేస్తే రియల్ లైఫ్‌లోనూ రేపిస్ట్ అనుకుంటారా? కేవలం ఒక అమ్మాయి బోల్డ్ రోల్ చేసేటప్పుడు మాత్రమే బోల్డ్ బోల్డ్ అని అంటారు. బోల్డ్ అనగానే స్క్రీన్ మీద లిప్‌లాక్ చేస్తే, స్కిన్ షో చేస్తే అలాంటి వాటిని బోల్డ్ అని ట్యాగ్ ఇస్తారు. అలాంటప్పుడు ఇప్పుడున్న జోనర్స్‌లో పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలలోనూ లిప్‌లాక్స్ అవుతున్నాయి. నేను బోల్డ్ క్యారెక్టర్లు చేస్తే ఏ కేటగిరీలో ఉన్న హీరోయిన్లు కూడా లిప్‌లాక్స్ చేస్తున్నారు.

రెక్కి సినిమా మొత్తం నేను శారీలోనే కనిపిస్తాను, స్కిన్ షో లేదు, అసభ్యంగా కూడా కనిపించలేదు. సంస్కార్ కాలనీ కూడా సైకలాజికల్ గేమ్‌నే చూపించారు, అందులోనూ శారీలోనే కనిపించా. అలా అనుకుంటే మెయిన్ స్ట్రీమ్ స్టార్ హీరోయిన్లు బికినీలు వేసుకుంటున్నారు, న్యూడ్ షోలు ధరిస్తున్నారు. కానీ వాళ్లు బోల్డ్ కాదు, వాళ్లకి ఎలాంటి ట్యాగ్స్ లేవు. ఛాలెంజింగ్ రోల్స్ చేసే మాకు బోల్డ్ ట్యాగ్ వేస్తున్నారు. నా దృష్టిలో మన నిర్ణయాలు మాత్రమే బోల్డ్.. రోల్ కాదు. ఈ క్యారెక్టర్స్ చేసిన తర్వాత చాలామంది మేకర్స్ నాకు గౌరవం ఇస్తున్నారు. బాలీవుడ్ నుంచి కూడా ప్రశంసిస్తూ కాల్స్ వస్తున్నాయి అని ఎస్తేర్ తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: ester noronha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X