పెళ్లైన 16వ రోజులకే బయటపడ్డ బాగోతం.. మూడేళ్లు ప్రేమ.. ఆరునెలల్లో విడాకులు
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సర్వసాధారణం. ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో..? ఎవరు ఎవరితో రిలేషన్ లో ఉంటున్నారో చెప్పడం కష్టం. అలాగే.. కొందరూ తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్తే.. మరి కొందరూ నచ్చినని రోజులు రిలేషన్ లో ఉంటారు. మరో కొందరూ తమకు నచ్చిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. తమ వివాహా బంధాన్ని చిన్నచిన్న కారణాలతో తెంచుకుంటున్నారు. అలా ఓ స్టార్ కపుల్ మూడేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ, కేవలం 16 రోజలు మాత్రమే తమ సంసారం జీవితాన్ని సాగించారు. 6 నెలలకే విడాకులు తీసుకుని వేరు పడ్డారు. ఇంతకీ ఆ స్టార్ కపుల్స్ ఎవరో ఓ లూక్కేయండి.
ఆ స్టార్ కపుల్ ఎవరో కాదు. నటి ఎస్తర్ నోరోన్హా- బిగ్ బాస్ ఫేమ్, సింగర్ నోయల్. ఇక నటి ఎస్తర్ నోరోన్హా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు 2013లో పూరి జగన్నాధ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన '1000 అబద్దాలు'తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ, ఈ మూవీతో ఈ అమ్మడుకు అంత గుర్తింపు రాలేదు. ఆ తరువాత 'భీమవరం బుల్లోడు'సినిమాలో నటించి.. ఫర్వాలేదని అనిపించింది. కానీ, ఎస్తర్ నోరోన్హ కు అనుకున్న స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. ఆ తరువాత జయ జానకి నాయక, జులియెట్ లవర్ ఆఫ్ ఇడియట్ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది.

చివరిగా.. తెలుగులో కళ్యాణ్ రామ్ 'డెవిల్' సినిమాలో నటించింది. కాసేపు ఈమె ప్రొఫెషనల్ లైఫ్ గురించి పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఎస్తర్ తన సినీ కెరీర్ బిజీగా ఉన్న టైమ్ లోనే నోయల్ అనే టాలీవుడ్ సింగర్ కమ్ యాక్టర్ తో ప్రేమలో
పడింది. వీరిద్దరూ దాదాపు మూడేళ్ల పాటు ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నారు. ఇలా ఈ జంట వివాహం 2019లో ఘనంగా జరిగింది. కానీ, వివాహ బంధం మూడ్నాళ్ల ముచ్చటగా మారింది. పెళ్లైన కేవలం 16 రోజులకే మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆరునెలలకే తమ వివాహ బంధాన్ని తెంచుకున్నారు.
తాజాగా హీరోయిన్ ఎస్తేర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నోయెల్‌తో ప్రేమ,పెళ్లి, విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను పెళ్లయ్యాక కేవలం ఆరు నెలలు భార్యభార్తలుగా ఉన్నామనీ, కానీ, అందులో తాము కేవలం 16 రోజులు మాత్రమే కలిసి ఉన్నామని, ఆ 16 రోజుల్లోనే నోయల్ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిసి వచ్చిందని హీరోయిన్ ఎస్తర్ నోరోన్హ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాము కలిసి ఉన్నా ఆరు నెలల్లో ఎన్నోసార్లు తమ బంధం గురించి ప్రస్తావించామని, కానీ, ఎలాంటి ఫలితం లేదన్నారు. దీంతో తానే విడాకులు తీసుకుందామనే నిర్ణయం తీసుకున్నాన్నారు. తమ వివాహ బంధంలో కొట్టుకోవడం గాని తిట్టుకోవడం గాని జరగలేదని, అలా జరిగి ఉన్న ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ తెలిసి ఉండేదని అన్నారు.

తమ మధ్య గొడవ జరిగిన ఇద్దరి మధ్య ప్రేమ అయినా బయటపడేదన్నారు. ఉన్నా ఆ 16 రోజుల్లోనే నోయెల్ నిజస్వరూపం తెలిసిందని, అందుకే అతని నుంచి విడాకులు తీసుకున్నట్లు ఎస్తర్ తెలిపింది.అయితే తాను ఎప్పుడూ.. నోయల్ పై అబద్దపు ప్రచారం చేయలేదనీ, ఆయన గురించి తానెప్పుడు బయట మాట్లాడలేదన్నారు. కానీ నోయెల్ మాత్రం తనపై దుష్ప్రచారం చేశాడని, సింపతి కోసం తమ విడాకుల ఇష్యూను వాడుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ విషయం తో అందరూ తనదే తప్పు అని భావించారని, సోషల్ మీడియాలో తనను బాగా ట్రోల్ చేశారని బాధపడింది.
నోయల్ ప్రతి విషయాన్ని చాలా సిల్లీగా ట్రీట్ చేశాడనీ, జీవితాన్ని కూడా గేమ్ లాగా చూశాడనీ, తన పేరెంట్స్ చీప్ గా చూసేవాడని సంచలన విషయాలు వెలుగులో పెట్టింది. జీవితం అనేది బిగ్ బాస్ షో కాదు. పెళ్లి కూడా జోక్. జీవితం గేమ్ కాదని అన్నారు. మనుషులతో ఆడుకోవడం. ప్రతి విషయాన్ని సిల్లీగా తీసుకోవడం తనకు అలవాటు అని హీరోయిన్ ఎస్తర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒక్కసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం జీవితాంతం కట్టుబడి ఉండాలని, అలాంటప్పుడు మాత్రమే మనపై ఇతరులకు ఒక నమ్మకం ఏర్పడుతుందన్నారు.


Click it and Unblock the Notifications











