‘ఈ ఏజ్‌లోనూ గోకుతున్నారు... ఏ క్షణమైనా వాళ్లతో కమిటైపోతానేమో’
సినిమా పరిశ్రమ.. సినీ నటులు అంటే అందరికీ అదో కలల ప్రపంచం. వెలుగు జిలుగులు, భారీ ఫాలోయింగ్, పాపులారిటీ చూసి ఎందరో సామాన్యలు తాము కూడా సినీతారలు కావాలని చెన్నై, హైదరాబాద్, ముంబై రైళ్లు ఎక్కేస్తారు. కానీ ఇక్కడి అడుగుపెడితే కానీ అసలు విషయం తెలియదు. అవకాశాలు అంతగా తేలికగా రావని.. కమిట్‌మెంట్, రాజీ, అడ్జెస్ట్, పడక సుఖం.. ఇలా విషయం ఏదైనా కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ అధికారాన్ని, హోదాను అడ్డుపెట్టుకుని అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తూనే ఉన్నారు.
చిత్ర పరిశ్రమలో చీకటి కోణాలు
ప్రతినిత్యం దేశంలో ఏదో ఒక నటి తమ జీవితంలో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులను బయటపెడుతూనే ఉన్నారు. పైకి పెద్ద మనషులుగా చెలామణి అయ్యేవారి చీకటి కోణాలను వెలుగులోకి తీసుకొస్తూనే ఉన్నారు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వారే కాదు.. స్టార్ హీరోయిన్లు కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్.. తాను కెరీర్‌లో ఈ స్థాయికి చేరుకున్నప్పటికీ ఇంకా కమిట్‌మెంట్ కావాలని అడుగుతూనే ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నటి ఎవరు? ఆమెను ఇప్పటికీ కమిట్‌మెంట్ అడుగుతున్నది ఎవరు? ఈ వివరాల్లోకి వెళితే..

నోయెల్‌తో పెళ్లి, విడాకులు
ఆ నటి ఎవరో కాదు.. ఎస్తర్ నోరోన్హా. భీమవరం బుల్లోడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత గరం, జయ జానకి నాయక తదితర చిత్రాల్లో నటించింది. అయితే హీరోయిన్‌గా ఆమెకు స్టార్‌డమ్ దక్కలేదు. సహాయక పాత్రలు, ఐటెం సాంగ్స్‌లోనూ నటించింది. ఒకదశలో హాట్ హాట్ సన్నివేశాల్లోనూ కనిపించి షాకిచ్చింది. సింగర్ నోయెల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎస్తర్.. అతనితో ఎక్కువ కలిసుండలేదు. వివాహం జరిగిన కొద్దిరోజులకే మనస్పర్థలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయారు. నాటి నుంచి ఎవరి జీవితం వారు సాగిస్తున్నారు. నోయెల్ తన సాంగ్స్, ఆల్బమ్స్, మ్యూజిక్ వీడియోలతో బిజీగా ఉంటుండగా.. ఎస్తర్ మాత్రం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకెళ్తోంది.
ఫిబ్రవరి 12న అమరావతికి ఆహ్వానం
తాజాగా ఎస్తర్ కీలకపాత్ర పోషించిన చిత్రం అమరావతికి ఆహ్వానం. శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ప్రియ, సురేఖవాణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీవీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైట్‌హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వరరావులు నిర్మిస్తున్నారు. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. తాజాగా అమరావతికి ఆహ్వానం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది.
ఆ హీరోయిన్లవి అబద్ధాలే
అటు చిత్ర యూనిట్ సైతం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. దీనిలో భాగంగా శివ కంఠంనేని, ఎస్తర్ నోరోన్హాలు ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా క్యాస్టింగ్ కౌచ్‌పై ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. కెరీర్ స్టార్టింగ్‌లో కొందరు పరోక్షంగా కమిట్‌మెంట్ అడుగుతారు, అది మనకి తెలిసి ఉండదు. కానీ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటారు. రెండ్రోజుల క్రితం కూడా నాకు కాల్ వచ్చింది. చాలామంది హీరోయిన్లు ఇంటర్వ్యూలలో నేను కష్టపడి వచ్చాను.. టాలెంట్‌తోనే పైకి వచ్చాను, ఒక్కరు కూడా నన్ను కమిట్‌మెంట్ అడగలేదని చెబుతారు. తర్వాత వాళ్లు చేసుంటారు. నేను కూడా అలాంటి వాళ్లలో ఒకరిని అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇందులో చాలా కేటగిరీలు ఉన్నాయి. కొందరు ఓపెన్‌గానే ఇలాంటివి చేస్తున్నామని చెబుతారని ఎస్తర్ వ్యాఖ్యానించింది.
పైకి దేవతలా వేషాలు
సినిమాలలో మేం ఎప్పుడూ శారీ క్యారెక్టర్స్ చేస్తున్నాం.. బయటికి దేవతలా ఉంటారు, కానీ చేయాల్సిన టైంలో అలాంటి పనులు చేస్తారు. అయితే నేను ఏ కేటగిరీలో ఉన్నాను అనేది క్లారిటీ రావడం లేదు. ప్రేక్షకులు కూడా ఈవిడ బాగానే మాట్లాడుతుంది, కానీ ఏదో ఒకటి చేసే ఉంటుందని అనుకుంటారు. కానీ వాళ్లు ఫిల్మోగ్రఫి చూడరు. నన్ను జనం ఇంతలా ప్రేమిస్తున్నారు.. నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్‌ను ఆదరిస్తున్నారు, ఆడియన్స్ సపోర్ట్ నాకుంది, మీడియా సపోర్ట్ ఉంది. అలాంటప్పుడు నేను ఎంతోమందితో కలిసి పనిచేస్తున్నాను, వాళ్లతో ఎలాంటి ఇష్యూస్ రాలేదు. మరి అందరు అనుకుంటున్న ఆ లీగ్‌లో ఎందుకు లేను నేను అని ఎస్తర్ ప్రశ్నించారు.
ఇప్పటికీ వదలడం లేదు
ఇప్పటికీ నేను గర్వంగా ఫీల్ అవుతా. కానీ కొంతమంది మాత్రం.. ఇప్పుడైనా, ఇన్ని సంవత్సరాల తర్వాతైనా నేను కమిట్‌మెంట్ ఇస్తానని ఎదురుచూస్తూ, గట్టిగా ట్రై చేస్తూనే ఉన్నారు. నేను అనుకున్న విధంగా సినీరంగంలో ఎదగలేకపోయాను, ఆ అవకాశం కోసమైనా, ఇప్పుడైనా తగ్గుతునేమో, వాళ్లకు కమిట్‌మెంట్ ఇచ్చేస్తానేమో, నేను కూడా ఆ కేటగిరీలో జాయిన్ అయిపోతానేమో అనే ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఎప్పటికీ నన్ను వదలరు, వాళ్ల ప్రయత్నాల్లో వాళ్లు ఉంటూనే ఉంటారని ఎస్తర్ నోరోన్హా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఎస్తర్‌ను ఇప్పటికీ గోకుతున్నది ఎవరంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











