For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పోర్న్ స్టార్‌గా మారిన నోయల్ మాజీ భార్య: ఎస్తర్ నిర్ణయానికి షాకౌతోన్న సినీ ప్రియులు

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖులు ప్రేమ వివాహాలు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వారిలో కొందరు మాత్రమే కలిసి ఉంటుండగా.. చాలా మంది పెళ్లైన కొన్నేళ్లకే విడాకులు తీసుకున్నారు. అలాంటి వారిలో సింగర్ కమ్ యాక్టర్ నోయల్ సీన్ - హీరోయిన్ ఎస్తర్ జంట ఒకటి. చాలా కాలం క్రితం తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన వీళ్లిద్దరూ విడాకులు తీసుకుని బాగా హైలైట్ అయ్యారు. ఇప్పుడు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ఎస్తర్ పోర్న్ స్టార్ అవతారం ఎత్తింది. అసలేం జరిగింది? ఆమె ఎందుకిలా మారింది? వివరాల్లోకి వెళ్తే..

   అబద్ధాలు అంటూ ఎంట్రీ ఇచ్చింది

  అబద్ధాలు అంటూ ఎంట్రీ ఇచ్చింది

  ‘1000 అబద్దాలు' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ ఎస్తర్‌. ఆ తర్వాత ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది. ఇందులో సునీల్‌తో కలిసి నటించిన ‘భీమవరం బుల్లోడు' చిత్రం మాత్రమే మంచి పేరును తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘గరం', ‘జయ జానకి నాయక' వంటి కొన్ని సినిమాల్లోనూ కనిపించింది. కానీ, అవేమీ ఆమెకు పెద్దగా గుర్తింపును తెచ్చి పెట్టలేదు.

  నోయల్ సీన్‌తో సీక్రెట్ లవ్.. పెళ్లి

  నోయల్ సీన్‌తో సీక్రెట్ లవ్.. పెళ్లి

  వరుస సినిమాలతో కెరీర్ సాఫీగా సాగిపోతోన్న సమయంలోనే ఎస్తర్.. సింగర్ కమ్ యాక్టర్ నోయల్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ చాలా కాలం పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించారు. ఇది బహిర్గతం అయిన తర్వాత తమ ప్రేమను స్వయంగా బయట పెట్టారు. ఈ క్రమంలోనే 2019లో ఈ జంట తమ కుటుంబ పెద్దల సమక్షంలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది.

  కొన్ని రోజులకే దూరం.. విడాకులు

  కొన్ని రోజులకే దూరం.. విడాకులు

  వివాహం చేసుకున్న కొన్ని రోజులకే నోయల్ సీన్ - హీరోయిన్ ఎస్తర్ మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఇద్దరూ అప్పటి నుంచి దూరంగా ఉండిపోయారు. అయితే, ఈ విషయాన్ని మాత్రం ప్రపంచానికి తెలియనీయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది చివర్లో న్యాయ బద్ధంగా విడాకులు తీసుకున్నట్లు ఇరువురూ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు వెల్లడించారు.

  విడాకుల తర్వాత తొలిసారి ఇలా

  విడాకుల తర్వాత తొలిసారి ఇలా

  నోయల్‌తో విడాకులు తీసుకున్న తర్వాత ఎస్తర్ పెద్దగా బయట కనిపించలేదు. కానీ, కన్నడ చిత్ర పరిశ్రమలో ఆమె వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. అక్కడ ఫుల్ బిజీగా ఉన్న సమయంలో కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలతో హల్‌చల్ చేసింది. ఈ సందర్భంగా విడాకులు, తన కెరీర్ గురించి ఎన్నో విషయాలు బయట పెట్టింది.

  పోర్న్ స్టార్‌గా మారిన హీరోయిన్

  పోర్న్ స్టార్‌గా మారిన హీరోయిన్

  ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇకపై టాలీవుడ్‌లోనే స్థిరపడాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది ఎస్తర్. అంతేకాదు, ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, అయితే వైవిధ్యమైన పాత్ర కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. అందుకు అనుగుణంగానే తనకు నచ్చని చాలా కథలను రిజెక్ట్ చేసేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ హీరోయిన్ పోర్న్ స్టార్‌గా మారింది.

  ఆమె నిర్ణయానికి వాళ్లంతా షాక్

  ఆమె నిర్ణయానికి వాళ్లంతా షాక్

  తెలుగులోకి ఘనమైన రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తోన్న ఎస్తర్.. ప్రస్తుతం ‘హీరోయిన్' అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఆమె పోర్న్ స్టార్‌గా కనిపించనుంది. ఎంతో బోల్డుగా ఉండే ఈ పాత్ర అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రానున్న దీనిని ‘ఉత్తర' అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు తిరుపతి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు.

  English summary
  Ester Noronha is an artist/entertainer, well known as a singer, dancer, performer and film actress in Konkani, Telugu and Kannada languages so far. She is currently venturing into Hindi, Tamil and Marathi film industries with two projects in each of these above-mentioned languages.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X