బాయ్ ఫ్రెండ్ ఫోటోలు అడిగితే దిమ్మతిరిగే షాకిచ్చిన ఎస్తేర్ అనిల్..అలవాటు పడిపోయిందట!
దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కుమార్తె పాత్రలో నటించిన ఎస్తేర్ అనిల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. స్వతహాగా మలయాళ చిత్రసీమకు చెందిన ఆమె దృశ్యం సినిమాలో నటించి తెలుగు వారికి కూడా పరిచయం అయింది. అయితే బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పుడు హీరోయిన్ గా మారి తాజాగా ఇంస్టాగ్రామ్ చాట్ సెషన్ లో తన బాయ్ ఫ్రెండ్ ఎవరనే విషయం మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

దృశ్యం సినిమాలో
కేరళలోని వాయనాడు ప్రాంతంలో జన్మించిన ఎస్తేర్ అనిల్ కు చిన్ననాటి నుంచి సినిమాలంటే ఆసక్తి ఉండేది. ఆమె ఆసక్తి గమనించి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడంతో చిన్ననాటి నుంచి బాలనటిగా మలయాళంలో అనేక సినిమాలు చేసింది. తర్వాత తమిళ చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసింది. అయితే తెలుగులో దృశ్యం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ జోహార్ అనే సినిమాతో హీరోయిన్ గా మారింది.

వేశ్య కూతురి పాత్రలో
రాజకీయ నేపథ్య సినిమాగా తెరకెక్కిన జోహార్ సినిమాలో ఒక వేశ్య కూతురి పాత్రలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల అందరి మన్ననలు అందుకుంది . అయితే ఈ భామ హీరోయిన్ గా మారిన నేపథ్యంలో ఈ మధ్య హాట్ ఫోటో షూట్ లు షేర్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. ఎద అందాలు బహిర్గతం చేస్తూ ఈమె గతంలో షేర్ చేసిన కొన్ని ఫోటో షూట్లు వెంటనే వైరల్ గా మారేవి. అయితే సాధారణంగా హీరోయిన్లు తమ తమ అభిమానులతో చాట్ సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే.

చాట్ సెషన్ లో భాగంగా
స్టార్ డం దక్కించుకున్న హీరోయిన్లు మొదలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్లు సైతం తమ అభిమానులతో టచ్ లో ఉంటూ వారి అభిమానాన్ని ఇంకా ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఎస్తేర్ అనిల్ కూడా తాజాగా చాట్ సెషన్ నిర్వహించింది. ఈ చాట్ సెషన్ లో భాగంగా ఒక అభిమాని మీ బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న ఫోటోలు కొన్ని పెట్ట పెట్టమని కోరితే ఒక కుక్క పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు పెట్టి నేను వాడితో బాగా అలవాటు పడిపోయాను ఏమీ అనుకోవద్దు అంటూ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

కాదనకుండా సినిమాలు
ఇటీవల విడుదలైన వెంకటేష్ దృశ్యం 2 సినిమాలో కూడా వెంకటేష్ చిన్న కుమార్తె పాత్రలోనే ఎస్తేర్ కనిపించింది. కానీ అప్పటికి ఇప్పటికీ సినిమా కొన్నేళ్లు దాటినట్టు చూపించారు కాబట్టి ఆమె కూడా యుక్త వయసులోకి వచ్చినట్టు చూపించారు. మొత్తం మీద ఈ భామ తెలుగు, తమిళ, మలయాళ భాషలలో ఎందులో అవకాశం వచ్చినా కాదనకుండా సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
Recommended Video


కధలు వినిపించారని
ఒకరిద్దరు తెలుగు దర్శకులు కూడా ఆమెకు కధలు వినిపించారని అయితే అవి నచ్చక ప్రస్తుతానికి పక్కన పెట్టిందని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఈ భామ తెలుగులో బిజీ అవుతుందో లేక తన సొంత భాష మలయాళం లోనే బిజీ అవుతుందో..


Click it and Unblock the Notifications











