భర్తతో ప్రభాస్ హీరోయిన్ విడాకులు.. 5 ఏళ్ల‌ బంధానికి అలాంటి ముగింపు

చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య ఎప్పుడు విడాకులు చోటు చేసుకుంటాయో తెలియడం లేదు. కొద్దిరోజుల క్రితం స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ తన భర్త సొహైల్ ఖతూరియాతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. నటీనటులు తమ జీవిత భాగస్వాములను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసినా.. తమ ఫోటోలు డిలీట్ చేసినా సినీవర్గాలు, అభిమానులు ఉలిక్కిపడుతున్నారు. ఎప్పుడు ఎవరు విడాకుల బాంబు పేలుస్తారోనని టెన్షన్ పడుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ తన భర్తకి విడాకులిచ్చింది.

ఆ నటి ఎవరో కాదు బాలీవుడ్ ముద్దుగుమ్మ ఎవలిన్ శర్మ. జర్మన్ తల్లికి, పంజాబీ తండ్రికి ఆమె జర్మనీలో జన్మించారు. ఈమెకు జన్మత: జర్మనీ పౌరసత్వం ఉంది. తొలుత మోడలింగ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత టర్న్ లెఫ్ట్ అనే హాలీవుడ్ మూవీతో వెండితెరపై అడుగుపెట్టారు అనంతరం ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్ అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. అనంతరం యే జవానీ హై దీవానీ, నౌటంకి సాలా, ఇష్క్, యారియన్, కుచ్ కుచ్ లోచా హై ఇష్కేదారియన్ తదితర హిందీ చిత్రాలలో నటించారు. 2019లో పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సాహోలో కీలకపాత్ర పోషించారు ఎవలిన్ శర్మ.

Evelyn Sharma Announces Divorce from Husband Tushaan Bhindi After Mutual Separation

ఇండో - ఆస్ట్రేలియా మూలాలన్న దంత వైద్యుడు, వ్యాపారవేత్త తుషాన్ భిండితో 2019 అక్టోబర్‌లో ఎవలిన్ శర్మకు నిశ్చితార్ధం జరిగింది. అనంతరం 2021 మే 15న వీరిద్దరూ వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో వీరి వివాహ ఘనంగా జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. నవంబర్ 2021లో కుమార్తెకు జన్మనిచ్చారు ఎవలిన్ శర్మ. ఆమెకు 'అవా రానియా భిండి' అని నామకరణం చేశారు. ఆ తర్వాత రెండోసారి గర్భం డాల్చారు ఎవలిన్. జూలై 2023లో ఆర్డెన్ అనే కుమారుడికి జన్మనిచ్చారు. వివాహం తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఎవలిన్ శర్మ.. తన భర్త, పిల్లలు, కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు. 2019లో పెళ్లికి ముందు ఎక్స్‌రే: ది ఇన్నర్ ఇమేజ్ అనే చిత్రంలో చివరిసారిగా ఓ స్పెషల్ సాంగ్‌లో నటించారు. ఆ తర్వాత పూర్తిగా కుటుంబానికే అంకితమయ్యారు.

ఎవలిన్ శర్మ- తుషాన్‌లు విడిపోతున్నట్లుగా గతంలోనే గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఈ పుకార్లకు ఎవలిన్ శర్మ చెక్ పెట్టారు. తన భర్తతో విడిపోతున్నట్లు ఆమె స్వయంగా ప్రకటించింది. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవలిన్ మాట్లాడుతూ.. మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు పేర్కొంది. అలాగే పిల్లల బాధ్యత మా ఇద్దరిది, ఈ క్లిష్ట పరిస్ధితుల్లో మేమిద్దరం గోప్యతను కోరుకుంటున్నాం. విడాకుల ప్రక్రియ స్నేహపూర్వకంగానే జరుగుతోంది. జీవితాంతం మా ఫ్రెండ్‌షిప్ ఉంటుందని ఎవలిన్ శర్మ వెల్లడించారు.

ఎవలిన్- తుషాన్‌ల విడాకుల వ్యవహారం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఎంతో అన్యోన్యంగా ఉండే జంట ఇలా విడిపోవడం అభిమానులకు, సినీ ప్రముఖులకు సైతం షాకిచ్చింది. అయితే విడాకుల సెటిల్‌మెంట్‌లో భాగంగా తుషాన్ నుంచి ఎవలిన్ భరణంగా ఎంత పొందుతున్నారు? తదదితర వివరాలు మాత్రం తెలియరాలేదు. ఏది ఏమైనా హన్సిక విడాకుల ప్రకటన వెలువడిన కొద్దిరోజులకే మరో స్టార్ హీరోయిన్ తన భర్త నుంచి విడిపోవడం దురదృష్టకరం.

Read more about: evelyn sharma tushaan bhindi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X