Don't Miss!
- News
ప్రతీ ఇంటా "మా నమ్మకం నువ్వే జగన్"...!!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ప్రభాస్ హీరోయిన్ ఎంగేజ్‌మెంట్.. గుట్టుచప్పుడు కాకుండా ఆస్ట్రేలియాలో.. ఎవరితోనంటే!
Recommended Video
బాలీవుడ్ హీరోయిన్ ఎవ్లీన్ శర్మ త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. గత కొద్దికాలంగా ప్రియుడితో డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నా.. ఆమె కొట్టిపడేశారు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే వివాహం చేసుకోవడానికి ఎవ్లీన్ సిద్దపడటం సినీ వర్గాలను, ప్రేక్షకులను షాక్ గురిచేశాయి. ఇటీవల సాహో చిత్రంలో తనదైన నటనను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఎవ్లీన్ నిశ్చితార్థం ఎవరితో జరిగిందంటే..

తుషాన్ భిండితో అఫైర్
సినిమాల్లో బిజీగా ఉంటూనే వ్యక్తిగత జీవితాన్ని ఎవ్లీన్ శర్మ ఓ మోతాదులో ఎంజాయ్ చేస్తున్నది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇన్స్‌టాగ్రామ్, ట్విట్టర్‌ను హీటెక్కిస్తుంటుంది. ఆస్ట్రేలియాలోని డెంటల్ సర్జన్ తుషాన్ భిండితో ప్రేమాయణం నడుపుతున్నది. తన ప్రేమ వ్యవహారాన్ని మరో మెట్టు ఎక్కించి పెళ్లి వరకు తీసుకొచ్చింది.

సిడ్నీ బ్రిడ్జి వద్ద కిస్
తాజాగా బాయ్‌ఫ్రెండ్ తుషాన్ భిండితో కలిసి సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్ద గాఢంగా తన ప్రియుడిని ముద్దు పెట్టుకొంటున్న ఫొటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. యస్ అంటూ ఓ కామెంట్ పెట్టారు. ఇంతకంటే రొమాంటిక్ జీవితం ఏముంటుంది అని ఫోటో కింద క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నది.

సాహోలో క్రేజీగా
కెరీర్ విషయానికి వస్తే, సాహోలో ఎవ్లీన్ శర్మ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రం హిందీలో ఘనవిజయం సాధించడంతో ఎవ్లీన్‌కు మంచి పేరు వచ్చింది. సాహో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. కాగా, సాహోలో తన పాత్రకు మంచి ప్రశంసలు దక్కడంపై ఎవ్లీన్ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

ఎవ్లీన్ వెంటపడిన ఫ్యాన్
ఇటీవల తన ఇన్స్‌టాగ్రామ్‌లో సాహోలో చోటు చేసుకొన్న ఓ సంఘటనను షేర్ చేసుకొన్నది. ఓ అభిమాని తన వెంటపడటం ఆమెను కంగారు పెట్టింది. సాహో షూటింగ్ నుంచి హోటల్ చేరుకొన్న ఎవ్లీన్‌ను అభిమాని వెంటాడటంతో ఆమె భయభ్రాంతులకు గురైంది. ఈ ఘటనపై ఆమె స్పందిస్తూ.. డైహార్డ్ ఫ్యాన్స్ ఉండటం జీవితంలో అంతకంటే అదృష్టం ఏముంటుంది అని అన్నారు.