సాహో హీరోయిన్‌కు చేదు అనుభవం.. రామోజీ ఫిలింసిటీలో ఏం జరిగిందంటే
అభిమానుల హద్దు మీరితే సినీ తారలకు ఇబ్బందులు ఎదురవ్వడమనేది సినీ పరిశ్రమలో చాలా సహజం. గతంలో ఎందరో సినీ హీరోలకు, హీరోయిన్లకు ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయనే విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి ఎవ్లీన్ శర్మకు సాహో షూటింగ్ సందర్భంగా చేదు అనుభవం ఎదురైంది. ఓ అభిమాని వెంటపడి వేధించడం ఎవ్లీన్ శర్మకు సమస్యగా మారింది. వివరాల్లోకి వెళితే..

సాహో మూవీ షూటింగ్ సందర్భంగా
హైదరాబాద్‌లో సాహో షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. అందాల తార ఎవ్వీన్ శర్మ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నది. కాగా ఇటీవల షూటింగ్‌లో విలన్ నీల్ నితిన్ ముఖేష్‌పై సన్నివేశాలు చిత్రీకరిస్తుండటంతో రామోజీ ఫిలిం సిటీలోని హోటల్‌కు ఎవ్లీన్ శర్మ బయలుదేరింది.

ఎవ్వీన్‌ను వెంటాడిన అభిమాని
ఎవ్లీన్ శర్మ వెళ్లడాన్ని గమనించిన ఓ అభిమాని ఆమెను వెంబడించారు. హోటల్ లాబీలో ఆమె కోసం కొన్ని గంటలపాటు వేచి ఉండటం సిబ్బంది గమనించారు. అయితే ఏకంగా హీరోయిన్ రూమ్ నెంబర్ కోసం ప్రయత్నించడంతో అనుమానం బలపడింది. దాంతో సిబ్బంది అతడిని ప్రశ్నించడం మొదలుపెట్టారు.

హోటల్ సిబ్బందికి చిక్కిన ఫ్యాన్
అభిమాని తనను చూడటానికి వచ్చి సిబ్బందికి చిక్కినాడని తెలుసుకొన్న ఎవ్లీన్ శర్మ తన మేనేజర్‌కు కబురు పెట్టి విషయంపై ఆరా తీసింది. ఎలాంటి గొడవ జరుగకుండా అభిమానిని హోటల్ పరిసర ప్రాంతం నుంచి బయటకు పంపేలా చర్యలు తీసుకొన్నది.

నాకు భయం కలిగిస్తుంది
అభిమాని వెంబండించిన విషయంపై తన సన్నిహితులతో మాట్లాడుతూ.. ఫ్యాన్స్ కలుసుకోవడానికి రావడం చాలా సంతోషంగా ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ల తీరు, వాళ్లు అనుసరించే విధానం చాలా భయాన్ని కలిగిస్తుంది. మా కోసం అపార్ట్‌మెంట్, హోటల్ వద్ద గంటలపాటు వేచి ఉండటం నిజంగా భయంగా ఉంటుంది అని ఎవ్లీన్ అన్నట్టు సమాచారం.

ఆగస్టు 15న సాహో రిలీజ్
కాగా, యాక్షన్, థ్రిల్లర్‌గా రూపొందుతున్న సాహో చిత్రానికి దర్శకుడు సుజిత్ రెడ్డి. ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌గా శ్రద్ధాకపూర్ నటిస్తున్నది. ఆగస్టు 15న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications











