కూతురుకు పాలిస్తున్న ఫోటో షేర్ చేసిన ప్రభాస్ హీరోయిన్.. నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఎవ్లీన్ శర్మ స్టైలే వేరు. ఏ విషయం గురించైనా ఎలాంటి బెరుకూ లేకుండా తన మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంటుంది. బోల్డ్ ఫొటోలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు పాలు ఇవ్వడం గురించి ఎవ్లీన్ శర్మ తరచుగా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఉంటుంది. పిల్లలకు పాలు ఇవ్వడాన్ని అసభ్యంగా చూడకూడదని ఈ బ్యూటీ ప్రచారం చేస్తుంటుంది. తాజాగా తన కూతురికి పాలు ఇస్తున్న ఫొటోను ఎవ్లీన్ అభిమానులతో పంచుకుంది.

మాతృత్వాన్ని చూడండి.. అశ్లీలాన్ని కాదు
పిల్లలకు పాలివ్వడంలో మాతృత్వాన్ని చూడండి.. అశ్లీలాన్ని కాదు అనే తన ప్రచారానికి మద్దతుగా ఎవ్లీన్ తాజాగా తన కూతురికి పాలిస్తున్న పిక్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోకు.. ప్రతి రోజూ బ్రెస్ట్ ఫీడింగ్.. అదే ఆరోగ్యం అంటూ క్యాప్షన్ కూడా రాసింది. పిల్లలకు పాలివ్వడం గురించి ఎవ్లీన్ మాట్లాడడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఎవ్లీన్ ఇలాంటి పిక్‌నే పోస్ట్ చేసింది. కాగా, ఎంతో మంది నెటిజన్లు ఈ ఫొటోపై కామెంట్స్ చేస్తున్నారు.

అభిమానుల రియాక్షన్
ఎవ్లీన్ తాజా ఫొటోకు నెటిజన్ల నుంచి భారీగా కామెంట్లు వస్తున్నాయి. కొందరు ఎవ్లీన్‌కు మద్దతు పలుకుతుంటే మరికొందరు నెగిటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్.. ప్రపంచంలోనే అత్యంత అందమైనది ఇదే. రాబోయే కొత్త తరానికి మీరే రోల్ మోడల్. ఎప్పటికీ ఇలాగే ఉండండి అంటూ కామెంట్ చేశారు. అలాగే మరికొందరు ఈ భామకి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. బిడ్డకు తల్లి పాలు ఇచ్చే దృశ్యాన్ని అందరికీ చూపిండచం అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఎవ్లీన్ ఫొటోపై అసభ్యకర కామెంట్లు చేశారు.

నా కష్టానికి అందే జీతం అదే..
బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఎవ్లీన్ చాలా రోజుల నుంచి ప్రచారం చేస్తోంది. ఓ మహిళగా అందుకు గర్వ పడాలని ఎవ్లీన్ తరచుగా చెబుతోంది. బిడ్డకు పాలు ఇస్తున్న ఫోటోలను ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. నేను ప్రస్తుతం అదే పనిలో ఉన్నాను. ఇప్పుడు అదే నా ఉద్యోగం. దీని కోసం ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. నా బిడ్డ ఆరోగ్యంగా ఏదగడమే నాకు కావాల్సింది. అదే నా కష్టానికి అందే జీతం. తల్లిగా ఎవరైనా కోరుకునేది బిడ్డ ఆరోగ్యమే అంటూ ఎవ్లీన్ చెప్పుకొచ్చింది.

ప్రెగ్నెన్సీ తర్వాత వివాహం.
.
ఆస్ట్రేలియాకు చెందిన డెంటల్ సర్జన్ తుషాన్ బిందీతో ఎవ్లీన్ చాలా కాలం సహజీవనం చేసింది. ఈ ఇద్దరూ వీలు కుదిరినప్పుడల్లా విహార యాత్రలకు వెళ్లేవారు. బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ చేసే సమయంలోనే ఎవ్లీన్ గర్భం దాల్చింది. దాంతో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. 2021 మే నెలలో వీరిద్దరికీ వివాహం జరిగింది. అదే ఏడాది నవంబర్‌లో వీరికి కూతురు జన్మించింది. ప్రస్తుతం ఎవ్లీన్ తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది.

బాలీవుడ్‌పై షాకింగ్ కామెంట్స్
జర్మన్ మోడల్ అయిన ఎవ్లీన్ శర్మ 2012లో ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత యే జవానీ హై దివానీ సినిమాలోనూ నటించింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహోలోనూ నటించింది. అయితే ఈమె అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. నాకు గతంలో ఎన్నో అవకాశాలు వచ్చినట్టే వచ్చి పోయాయి. రాత్రికి రాత్రే నన్ను ఎన్నో సినిమాల్లో నుంచి తీసేశారు. బాలీవుడ్‌లో రాణించాలంటే డబ్బూ, అధికారం ఉండాలని కొన్ని రోజుల క్రితం ఎవ్లీన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.


Click it and Unblock the Notifications











