ప్రతి శుక్రవారం తలరాత మారిపోతుంది.. ఇండస్ట్రీపై తమన్నా షాకింగ్ కామెంట్స్..
స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ ముద్దుగుమ్మ.. ఎంతోమంది స్టార్ హీరోలకు ఫేవరెట్ హీరోయిన్. ఇలా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు దాదాపు రెండు దశాబ్దాలుగా తనదైన గుర్తింపుతో ఇండస్ట్రీలో దూసుకపోతుంది. తాజాగా ఇండస్ట్రీపై ఈ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?
ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న తమన్నా సినిమా ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. 'ఈ పరిశ్రమలో ఏదీ శాశ్వతం కాదు. మీరు ఎంతకాలం పనిచేశారు, గతంలో ఎంత గొప్పగా చేశారు అన్నది ముఖ్యం కాదు. ప్రతి శుక్రవారం మీ తలరాలను మార్చేస్తుంది. ఆ వారం విడుదలయ్యే సినిమా ఫలితమే మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఆ ఫలితం వల్ల ప్రజలు మిమ్మల్ని చూసే విధానాన్ని నిర్ణయిస్తుంది' అంటూ సినీ ప్రపంచంలోని వాస్తవ పరిస్థితిని బయటపెట్టారు. అంతేకాదు, 'ఇక్కడ సక్సెస్ ఉన్నప్పుడే గౌరవం దక్కుతుంది. అదే నన్ను ఎప్పుడూ ఇండస్ట్రీలో నిలబెడుతుంది' అని చెప్పారు.

నేను కేవలం గ్లామర్ బొమ్మను కాదు
తనపై తరచూ వచ్చే 'గ్లామర్ హీరోయిన్' ట్యాగ్‌పై కూడా తమన్నా క్లారిటీ ఇచ్చారు. 'నేను అందంగా ఉన్నాననో, తెల్లగా ఉన్నాననో అవకాశాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. కేవలం గ్లామర్ బొమ్మలా ఎవరు నన్ను చూస్తారన్న భ్రమ నాకు లేదు. అదే సమయంలో, నేను తెలివైనదాన్ని కాదని ఎవరైనా అనుకున్నా నాకు సమస్య లేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్లడమే నాకు తెలుసు' అంటూ తన ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నారు.
అదే సమయంలో ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం విడుదలయ్యే సినిమాల్లో 60 శాతం పైగా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేవన్న ట్రేడ్ రిపోర్ట్స్ కూడా ఆమె మాటలకు బలం చేకూరుస్తున్నాయి. ఇండస్ట్రీ నటీనటులకు వినయం, అడాప్టబిలిటీ ఎంత ముఖ్యమో ఆమె వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని అభిమానులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి శుక్రవారం ఒక కొత్త పరీక్షే'అన్న తమన్నా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఇదిలా ఉంటే.. గ్లామర్‌కే పరిమితం కాకుండా యాక్షన్, అడ్వెంచర్ వంటి కొత్త జానర్లలోనూ అడుగుపెడుతున్న తమన్నా... 2026లో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెట్టింది. వేసవి కానుకగా మే 15 న సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన 'వ్యాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' (Vvan) థియేటర్లలోకి రాబోతోంది. అలాగే.. అజయ్ దేవగన్, సంజయ్ దత్ వంటి దిగ్గజ నటులతో కలిసి నటిస్తున్న 'రెంజర్' (Ranger) డిసెంబర్ 4 న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ యాక్షన్ అడ్వెంచర్ కోసం మునుపెన్నడూ చూడని రీతిలో ఫైట్స్ కూడా చేసినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











