ఘాటు అందాలతో హనీ అరాచకం.. ఆ ఫోజులకు చూపు తిప్పుకుంటే ఒట్టు

అందం, టాలెంట్ ఉన్న చాలా మంది హీరోయిన్లు టాలీవుడ్‌లో ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపును దక్కించుకున్నారు. వారిలో క్యూట్ లేడీ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ఒకరు. తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే సత్తా చాటిన ఈ చిన్నది.. ఈ మధ్య కాలంలో మాత్రం పెద్దగా అవకాశాలను సొంతం చేసుకోవడం లేదు. అయినప్పటికీ తన రేంజ్‌ను మాత్రం కంటిన్యూ చేస్తూ వెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ మెహ్రీన్ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిన్నది కొన్ని బోల్డు ఫొటోలు వదిలింది. అవి మీకోసమే!

కృష్ణగాడితో ప్రేమగాథ
సినిమాల కంటే ముందే మోహ్రీన్ కౌర్ ఫిర్జాదా మోడల్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అలా ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించిన ఈ చిన్నది.. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి సినిమాలోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీని దక్కించుకుని యమ హైలైట్ అయింది.

F2 Actress Mehreen Kaur Pirzada Latest Beautiful Photos Viral

వరుస సక్సెస్‌లు చూసి
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ఆరంభంలోనే వరుస సినిమాలు చేసింది. సుదీర్ఘమైన కెరీర్‌లో ఈ గ్లామర్ లేడీ 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'మహానుభావుడు', 'ఎఫ్2', 'రాజా ది గ్రేట్', 'అశ్వద్ధామ' వంటి విజయాలను కూడా సొంతం చేసుకుంది. అలాగే, హిందీ, తమిళం, పంజాబీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకునిపోతోంది.

పెళ్లికి ముందు బ్రేకప్
సినీ ప్రయాణాన్ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తున్నప్పుడే మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయ్ కుమారుడు, యువ నేత భవ్య బిష్నోయ్‌తో లవ్ ట్రాక్ నడిపింది. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితం అతడితో నిశ్చితార్థం చేసుకుంది. అయితే, పెళ్లికి ముందే దానికి బ్రేకప్ చెప్పేసింది.

ఆ రెండు సినిమాలు
టాలీవుడ్‌లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న మెహ్రీన్ కౌర్‌కు ఈ మధ్య పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. కానీ, ఆ మధ్య ఈ ముద్దుగుమ్మ F3 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ చిత్రం ఆశించిన రీతిలో ఆడలేదు. ఇక, ఇప్పుడు తెలుగులో 'స్పార్క్', కన్నడంలో 'నీ సిగూవరగే' అనే చిత్రాలు మాత్రమే చేస్తోంది. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.

సోషల్ మీడియాలోనే
అప్పుడు వరుసగా సినిమాలు చేసినా.. ఈ మధ్య కాస్త గ్యాప్ ఇస్తున్నా క్యూట్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా మాత్రం సోషల్ మీడియాలోనూ ఫుల్ బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే సినిమా అప్‌డేట్లను కూడా తరచుగా ఇస్తోంది. ఫలితంగా ఈ బబ్లీ హీరోయిన్‌ క్రేజ్ క్రమంగా పెరుగుతూనే ఉంటోంది.

F2 Actress Mehreen Kaur Pirzada Latest Beautiful Photos Viral

గ్లామర్‌తో రెచ్చగొట్టేలా
చాలా మంది యంగ్ హీరోయిన్లతో పోలిస్తే మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఈ బ్యూటీ అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసి హైలైట్ అవుతోంది. ఇలా తన అందచందాలతో మాయ చేస్తూ మెహ్రీన్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపి పడేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X