మృణాల్ థాకూర్‌తో రిలేషన్‌షిప్.. సుమంత్ రెండో పెళ్లి వార్తలో షాకింగ్ ట్విస్ట్
సినిమా హీరో, హీరోయిన్లపై సోషల్ మీడియాలో వచ్చే రూమర్లు, గాసిప్స్ చూస్తే కొన్నిసార్లు నమ్మాలా? వద్దా? అనే సందేహాలు ఎక్కువగా వ్యక్తమవుతుంటాయి. ఇద్దరు తారల మద్య ఉండే సంబంధాలు, బంధాలు బయట ప్రపంచానికి మరో విధంగా ప్రొజెక్ట్ అవుతుంటాయి. తాజాగా అలాంటి కన్‌ఫ్యూజన్ రిలేషన్ మీడియాలో హంగామా చేస్తున్నది. ఇటీవల సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో స్టార్ ఇమేజ్ అందుకొన్న హీరోయిన్ మృణాల్ థాకూర్, సీనియర్ హీరో సుమంత్ రిలేషన్‌షిప్ గురించి రూమర్లు వైరల్ అయ్యాయి. ఈ రిలేషన్‌షిప్ గురించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..
లెజెండరీ అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోలలో సుమంత్ ఒకరు. ఆయన ఇటీవల కాలంలో ఆచీ తూచీ సినిమాలు చేస్తున్నారు. ఎప్పుడూ లో ప్రొఫైల్‌లో తన ఇమేజ్ మెయింటెన్ చేస్తూ మీడియాకు దూరంగా ఉంటారు. కీర్తి రెడ్డితో డైవోర్స్ తర్వాత సింగిల్‌గానే ఉంటూ వస్తున్నారు. పెళ్లి గురించి పెద్దగా ప్రస్తావన తెచ్చే ప్రయత్నం కూడా చేయరు. మ్యారేజ్ బ్రేక్ తర్వాత సింగిల్ గానే ఉంటూ వస్తున్నారు.

హీరోయిన్ కీర్తీ రెడ్డిని వివాహం చేసుకొన్న తర్వాత ఎంతో కాలం వారి దాంపత్య జీవితం కొనసాగలేదు. అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ఇద్దరు పరస్పర అవగాహనతో విడిపోయారు. అయితే తనకు పెళ్లి చేసుకొనే ఉద్దేశం లేదు. దానిపై పెద్దగా ఆసక్తి లేదు అంటూ సుమంత్ తన లైఫ్ గురించి పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
కానీ ఇటీవల కాలంలో మృణాల్ థాకూర్‌తో అఫైర్, డేటింగ్ అనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. వారి మధ్య కొంతకాలంగా రిలేషన్‌షిప్ కొనసాగుతుంది. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. అయితే వాటిని మృణాల్ థాకూర్ గానీ, ఇటు సుమంత్ గానీ, మరొకరు గానీ స్పందించకపోవడంతో ఈ రూమర్లపై ఇంకా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
సుమంత్ రెండో పెళ్లి వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రూమర్లను ఆయన సన్నిహిత వర్గాలు కొట్టిపడేసినట్టు తెలిసింది. వారిద్దరి బంధంపై వస్తున్న వార్తల గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే మృణాల్, సుమంత్ మధ్య ఎవరూ ఊహించని రిలేషన్‌షిప్ ఉంది. కానీ మీరు అనుకొనే విధంగా ఆఫైర్ కాదు. వారిద్దరి మధ్య ఉన్న అన్నా చెల్లెల బంధం లాంటింది అని గాసిప్ వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం సోషల్ మీడియాలో కనిపించింది. అయితే వారి మధ్య అలాంటి రిలేషన్‌షిప్ ఉందా? అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇదే విషయాన్ని వారిలో ఎవరైనా క్లారిటీ ఇస్తే ఇలాంటి గాలి వార్తలకు చెక్ పడే అవకాశం ఉంటుంది.
మృణాల్ థాకూర్ కెరీర్ విషయానికి వస్తే.. హాయ్ నాన్న తర్వాత ఆమె కల్కి చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. బాలీవుడ్‌లో పూజా మేరి జాన్, హాయ్ జవానీ తో ఇష్క్ హోనా హై, తుమ్ హోతో, డెకాయింట్: ఏ లవ్ స్టోరి సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం హిందీ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











