Fact Check: దీపిక పదుకొనె ప్రసవంపై రూమర్లు.. డెలివరీ డేట్ ఎప్పుడంటే?
సోషల్ మీడియా రాకతో ఏది అసలు వార్తో, ఏది నకిలియో గుర్తించలేని పరిస్ధితి నెలకొంది. నిజం చొక్కా వేసుకునేలోగా.. అబద్ధం ఊరంతా తిరిగొస్తుందన్నట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. వ్యూస్ కోసం, క్రేజ్ కోసం కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు నిరాధారమైన వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉన్న వారు ఈ దందాకు టార్గెట్‌గా మారుతున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె తన సహ నటుడు రణవీర్ సింగ్‌ను 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహమైనప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఆఫర్లు దక్కించుకుని దూసుకెళ్తున్నారు దీపిక. పెళ్లయి ఆరేళ్లు కావొస్తున్నా ఇంత వరకు గుడ్ న్యూస్ చెప్పలేదంటని అభిమానులు ఈ జంటను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు. పలుమార్లు దీపిక ప్రెగ్నెంట్ అని, ఇదిగో బేబీ బంప్ అంటూ న్యూస్ వైరల్ అయ్యింది. కానీ అవన్నీ రూమర్స్ అని రణవీర్ కపుల్ కొట్టిపారేశారు.

అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 18న లండన్‌లో జరిగిన బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డుల కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన దీపిక పదుకొనె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు ఆ సమయంలో తన చీర కొంగుతో బేబీ బంప్‌ను దాచుకోవడానికి ప్రయత్నించినట్లుగా ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇది జరిగిన కొద్దిరోజులకే రణవీర్ - దీపికలు తమ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పారు. చిన్నారి దుస్తులు, చెప్పులు, బొమ్మలతో డిజైన్ చేసిన ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నట్లుగా ప్రకటించారు.
గర్భం దాల్చినప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు చేసి వృత్తిపై తన అంకిత భావాన్ని చాటుకున్నారు దీపిక. నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన కల్కి 2898 ఏడీలో నటించారు. అంతేకాదు.. ముంబై, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జరిగిన కల్కి ప్రమోషనల్ ఈవెంట్లకు కూడా హాజరయ్యారు. ఈ సమయంలో ప్రభాస్ దీపికను కేరింగ్‌గా చూసుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.

తాజాగా దీపికా పదుకొనె మగబిడ్డకు జన్మనిచ్చినట్లుగా శనివారం వార్తలు వైరల్ అయ్యాయి. ఇది నిజమేమోనని కొన్ని న్యూస్ ఛానెల్స్ బ్రేకింగ్స్ కూడా నడిపాయి. ఈ విషయం తెలుసుకుని సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, బిడ్డను దీవిస్తున్నారు. కట్ చేస్తే.. ఇది ఫేక్ న్యూస్ అని తేలింది. దీపిక ఎలాంటి బిడ్డను ప్రసవించలేదని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
తమ బిడ్డ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న దీప్‌వీర్.. క్లౌడ్‌నైన్‌లో ఉన్నారు. ఫిబ్రవరి 29న గర్భం దాల్చినట్లు ప్రకటించిన ఈ స్టార్ కపుల్.. డెలివరీ డేట్ ఎప్పుడనేది వెల్లడించనప్పటికీ, సెప్టెంబర్ 2024లో తమ మొదటి బిడ్డ రాక కోసం ఎదురుచూస్తున్నట్లుగా హింట్ ఇచ్చారు. అంటే అప్పటికీ దీపికకు నెలలు నిండుతాయన్న మాట. అలాంటిది సెప్టెంబర్‌కు ఇంకా టైం ఉండగానే నెటిజన్లు అత్యుత్సాహం ప్రదర్శించడం దేనికంటూ కొందరు ఫైర్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











