Samantha Divorce: అక్కినేని ఫ్యామిలీ 200 కోట్ల భరణాన్ని తిరస్కరించిన సమంత.. అసలు కారణం ఏమిటింటే?

దక్షిణాదిలో స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత తమ దాంపత్య జీవితానికి గుడ్‌బై చెప్పడం అభిమానులకు, సినీ ప్రముఖులకు షాక్‌కు గురి చేసింది. కొద్దికాలంగా మీడియాలో వస్తున్న ఊహగానాలకు తెరదించుతూ తమ బ్రేకప్ గురించి అక్కినేని నాగచైతన్య, సమంత క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున, అమల తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వివరణ, తమ అభిప్రాయాలను షేర్ చేసుకొన్నారు. అయితే విడాకుల సమయంలో సమంతకు భారీగా భరణం ఇచ్చారనే విషయం అత్యంత చర్చనీయాంశమైంది. ఆ వివారాల్లోకి వెళితే..

Recommended Video

₹200 Cr వదులుకున్న Samantha, వింత ప్రచారాలు.. షూటింగుకు వెళ్లడం కష్టం | ChaySam | Filmibeat Telugu
పెళ్లి రోజుకు ఐదు రోజుల ముందే...

పెళ్లి రోజుకు ఐదు రోజుల ముందే...

సమంత, నాగచైతన్య పెళ్లి రోజు అక్టోబర్ 7. అయితే తమ పెళ్లికి ఐదు రోజుల ముందే విడాకులు తీసుకొంటున్నట్టు ప్రకటించి అందర్నీ విస్మయానికి గురిచేశారు. నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు చెప్పాలని తీసుకొన్న నిర్ణయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అయితే తమ మధ్య దశాబ్దకాలంగా ఉన్న స్నేహబంధం కొనసాగుతుందని వారిద్దరి క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా నాగార్జున కూడా సమంత అంటే మాకు చెప్పలేనంత ఇష్టం. ఆ ప్రేమ అలాగే కొనసాగుతుంది అని స్పష్టం చూశారు.

200 కోట్ల భరణాన్ని తిరస్కరించిన సమంత

200 కోట్ల భరణాన్ని తిరస్కరించిన సమంత

అయితే విడాకుల ఇచ్చినందుకు నాగచైతన్య ఫ్యామిలీ సమంతకు 200 కోట్ల భరణాన్ని ఇచ్చేందుకు సిద్దమయ్యారనే వార్తలు మీడియాలో ప్రచారమమయ్యాయి. 200 కోట్లతోపాటు అదనంగా 50 కోట్లు ఇస్తున్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఆ భరణాన్ని సమంత తిరస్కరించిందనే విషయం కూడా మీడియాలో వైరల్ అయింది. అయితే సమంత గానీ, అక్కినేని ఫ్యామిలీ ఈ విషయంపై పెదవి విప్పకుండా జాగ్రత్త పడ్డారు.

తన సొంత కష్టాన్ని నమ్ముకొని..

తన సొంత కష్టాన్ని నమ్ముకొని..

అక్కినేని ఫ్యామిలీ ఇచ్చే భరణంలో నయాపైసా కూడా సమంత తీసుకోకూడదని నిర్ణయించుకొన్నారు. దక్షిణాదిలో అగ్ర హీరోలు, టాప్ బ్యానర్లతో పనిచేసి అనుభవం ఉంది. సినిమాపై ఆమె తన కష్టాన్ని, పట్టుదలను, అంకితభావాన్ని నమ్ముకొన్నారు. అందుకే దాంపత్య జీవితం విఫలమైనా ఆమె డబ్బు తీసుకోకూడదని అనుకొన్నారు అని కథనాల్లో పేర్కొన్నారు.

పెళ్లికి ముందే అలాంటి ఒప్పందం

పెళ్లికి ముందే అలాంటి ఒప్పందం

అయితే సమంత భరణం తిరస్కరించారనే విషయం ప్రచారంలోకి వచ్చిన తర్వాత.. మరో కథనం కూడా సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పెళ్లికి ముందు చేసుకొన్న ఒప్పందంలో భవిష్యత్‌లో అనుకోని పరిస్థితులు కారణంగా విడిపోవాల్సి వస్తే.. భరణం తీసుకోకూడదనే విషయాన్ని ప్రస్తావించారు. ఆ క్లాజ్ కారణంగానే సమంత తనకు వచ్చే భరణాన్ని తీసుకోకూడదని నిర్ణయించుకొన్నారనే విషయంపై ఫిలింనగర్‌లో చర్చ జరుగుతున్నది. అయితే అలాంటి క్లాజ్ చేసుకొన్నారా అనే విషయం మరింత చర్చనీయాంశమైంది.

సినిమాలకు సమంత దూరం

సినిమాలకు సమంత దూరం

ఇక విడాకులు తర్వాత సమంత పూర్తిస్థాయిలో తన కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమంత షూటింగుకు వెళ్లడం కష్టమైన పనే. తన మ్యారేజ్ బ్రేకప్‌తో సమంత హృదయం ముక్కలైంది. ఇప్పట్లో ఎలాంటి ప్రాజెక్టులు ఒప్పుకోవద్దనే ఆలోచనల్లో ఉన్నారు. కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు. కొద్ది రోజులు ఆమెకు మానసిక విశ్రాంతి అవసరం. ఆ తర్వాతే సినిమాలపై తదుపరి నిర్ణయం తీసుకొంటారు అని సమంత సన్నిహితులు చెబుతున్నారు.

సమంత సినీ కెరీర్ ఇలా..

సమంత సినీ కెరీర్ ఇలా..

సమంత కెరీర్ విషయానికి వస్తే.. 2020లో జాను అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో నటించారు. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. అలాగే తమిళ చిత్రం కాథు వాకులా రెండు కాదల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ నిర్మాతగా, అలాగే నయనతార, విజయ్ సేతుపతి ఓ కీలకపాత్రను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X