యాంకర్ అనసూయను టార్గెట్ చేస్తూ బూతులు.... పోలీసులకు ఫిర్యాదు!

యాంకర్ అనసూయ... తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. టీవీ యాంకర్‌గా, హోస్ట్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. అభిమానులతో సినిమాలు, టీవీ షోలకు సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విశేషాలు కూడా కూడా షేర్ చేసుకుంటారు.

అయితే సినిమా సెలబ్రిటీలపై కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో అసభ్యమైన కామెంట్లు చేస్తూ రెచ్చిపోవడం ఈ మధ్యకాలంలో ఎక్కైంది. వారి పేరుతో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేసి బూతు పోస్టులు పెట్టడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి వారి బాధితులకలో యాంకర్ అనసూయ కూడా ఒకరు.

అనసూయ పేరుతో బూతు పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు

అనసూయ పేరుతో బూతు పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు

యాంకర్ అనసూయ పేరుతో నకిలీ అకౌంట్లు తెరిచి బూతు పోస్టులు పెట్టడంతో పాటు అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్న వారిపై ప్రొగ్రెసివ్ యూత్ నాయకులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అనసూయ ప్రతిష్ట దెబ్బతినేలా...

అనసూయ ప్రతిష్ట దెబ్బతినేలా...

అనసూయ ప్రతిష్ట దెబ్బతినేలా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నట్లు యూత్ సభ్యులు వెల్లడించారు. వెంటనే వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వీటి వల్ల అనసూయకు మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందిగా మారిందన్నారు.

ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి

ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి

అనసూయతో పాటు చాలా మంది సెలబ్రిటీలు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. ఈ నకిలీ ఖాతాలు క్రియేట్ చేసి అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించినపుడే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయని ప్రొగ్రెసివ్ యూత్ సభ్యులు అభిప్రాయ పడ్డారు.

అనసూయ

అనసూయ

ప్రస్తుతం అనసూయ పలు చిత్రాల్లో లీడ్ రోల్ చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘కథనం' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు సరిలేరు నీకెవ్వరు, ఆడ్రా మచ్చా అనే చిత్రాల్లో ఆమె కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాదు... వెబ్ సిరీస్‌లు చేసే ఆలోచన కూడా ఉందని ఈ చలాకీ యాంకర్ తెలిపారు. లీడ్ రోల్‌లో ఏదైనా మంచి కథ వస్తే వెబ్ సీరిస్ చేసేందుకు అనసూయ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆన్ లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంలో వెబ్ సిరీస్ హవా నడుస్తున్న నేపథ్యంలో అనసూయ ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X