Mrunal Thakur: చావు భయపెడుతోంది.. పెళ్లి, పిల్లల గురించి మృణాల్ షాకింగ్ కామెంట్స్

మృణాల్ థాకూర్... సీతారామం సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమాతో కుర్రకారు డ్రీమ్ గర్ల్ అయిపోయింది. మాకు ఇలాంటి వైఫ్ రావాలని అంతా కోరుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తుంది ఈ బ్యూటీ. ఇక ఈ సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ చేశారు మేకర్స్. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈ బ్యూటీ తన పెళ్లి, పిల్లలు గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేయండి.

కుర్రకారు మనసును దోచి...
బాలీవుడ్ లో ఓ సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన మృణాల్ థాకూర్.. తెలుగులో సీతారామం సినిమాతో కుర్రకారు హృదయాన్ని దోచేసింది. ఈ సినిమాలో సీతగా అలరించి.. డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మృణాల్. ఆ సినిమా కూడా సక్సెస్ అయింది. ఇప్పుడు విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Family Star Heroine Mrunal Thakur Comments on Her Marriage Life Kids And Death Full Details Here

ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ గా...

ఈ సినిమాకు గీతా గోవిందం దర్శకుడు పరుషురామ్ డైరెక్టర్ గా వ్వవహిరిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక దివ్యాంశ కౌశిక్‌, అజయ్‌ ఘోష్‌, వాసుకి కీలక పాత్రల్లో నటిస్తుండగా రష్మిక మందన్నా ఓ పాటలో కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. వీరితో పాటు విదేశి బ్యూటీ 'మరిస్సా రోజ్ గార్డన్' ముఖ్య పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తుంది.. వేసవి కానుకగా ఏప్రిల్‌ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు దీనిని నిర్మిస్తున్నారు.

షాకింగ్ కామెంట్స్...

అయితే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్స్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నాయి. మరోవైపు చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు తెలియజేసింది. సెలబ్రిటీలుగా ఉండటం వల్ల వచ్చే లాభనష్టాలపై మాట్లాడింది. ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Family Star Heroine Mrunal Thakur Comments on Her Marriage Life Kids And Death Full Details Here

పెళ్లి గురించి చెప్తూ...

అసలు మృణాల్ దేని గురించి మాట్లాడిందంటే.... సెలబ్రిటీగా ఉంటే ఈ ప్రపంచం ప్రేమిస్తుందన్న మృణాల్... వర్క్‌తో సమాజంలో మార్పు తీసుకురావచ్చని చెప్పుకువచ్చింది. ఇబ్బందుల గురించి చెప్పాలంటే.. వర్క్‌లో భాగంగా కుటుంబానికి దూరంగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. అవసరమైనప్పుడు కుటుంబసభ్యుల పక్కన ఉండలేమని మృణాల్ తెలియజేసింది. కొన్నిసార్లు నాక్కూడా ఒక సాధారణ జీవితాన్ని గడపాలనిపిస్తుందని తమ మనసులో మాటను బయటపెట్టింది.

చావు భయపెడుతోంది...

ఇరవైల్లోనే పెళ్లి చేసుకుని, పిల్లలను కని, డిన్నర్‌ కోసం రెస్టారంట్‌కు వెళ్లి రావొచ్చని తెలిపింది మృణాల్. అయితే చావు గురించి ఆలోచిస్తే భయంగా ఉంటుందని షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను చనిపోతే కుటుంబం ఏమైపోతుందా అని ఎక్కువగా ఆలోచిస్తుంటానని చెప్పుకువచ్చింది. ఇక తన కెరియర్ గురించి మాట్లాడుతూ... నటిగా కెరీర్‌ ఆరంభించిన సమయంలో భారీ ప్రాజెక్ట్‌లో తనకు అవకాశం వచ్చిందని.. అయితే కొన్ని కారణాల వల్ల అది చేజారీ పోయినట్లు వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X