HBD Samantha: సమంతకు గుడి కట్టిన అభిమాని.. ఆంధ్రాలో టెంపుల్ ఎక్కడుందో తెలుసా?
దక్షిణాదిలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో తన ప్రతిభతో ఆకట్టుకొంటున్న సమంతకు దేశవ్యాప్తంగా విశేషంగా అభిమానులు ఉన్నారంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. గ్లామర్ హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. తన కంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకొని సోలో హీరోయిన్‌గా సినిమాలను హిట్ చేసే స్థాయికి ఎదిగింది. అలాంటి సినీ తారకు ఓ అభిమాని గుడి కట్టి తన అభిమానాన్ని చాటుకొన్నాడు. సమంతను దేవతగా మార్చి కొలుస్తున్న అభిమాని కట్టిన గుడి ఎక్కడ ఉందనే వివరాల్లోకి వెళితే..
గత కొన్ని సంవత్సరాలుగా వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్న సమంత ఇటీవల కాలంలో వాటిని ఎదురించి మానసికంగాను, అలాగే శారీరకంగాను పూర్తి ఆరోగ్యంతో సిద్దమయ్యారు. తన దాంపత్య జీవితం విఫలమైనప్పటి నుంచి ఆమె సినిమాలకు, మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల కాలంలోనే ఆమె మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే తాజాగా సమంత సినిమా ఇండస్ట్రీలో ఓ అడుగు ముందేశారు. ఆమె సొంత బ్యానర్‌ను ప్రారంభించి.. నిర్మాతగా మారారు. ఆమె నిర్మించిన చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. తన సినిమా ప్రమోషన్స్ ప్రారంభించడానికి ముందు ఆమె తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్నారు. ఆ తర్వాత సమంత తన సినిమా ఈవెంట్స్‌ను నిర్వహించేందుకు సిద్దమయ్యారు.
ఇదిలా ఉండగా, సమంతను విపరీతంగా అభిమానించే సందీప్ అనే ఓ తెలుగు యువకుడు ఆమెకు బాపట్లలో గుడి కట్టారు. ఆమె కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆమె విగ్రహంపై మండపం నిర్వహించి అందంగా అలకరించాడు. ఆ మండపంలో రెండు రకాల సమంత విగ్రహాలను నెలకొల్పి తన అభిమానాన్ని చాటుకొన్నాడు. దానికి టెంపుల్ ఆఫ్ సమంత (The Temple of Samantha) ప్రస్తుతం సమంత గుడికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సమంత పుట్టిన రోజున అంటే ఏప్రిల్ 28వ తేదీన బాపట్లలో గుడిని ఆవిష్కరించారు. ఊరిలోని పిల్లలు, పెద్దల్ని పిలిచి భోజనాలు ఏర్పాటు చేశారు. పిల్లలందరూ ఈ సందర్భంగా సమంతకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ.. నా పేరు తెనాలి సందీప్. ఆలపడుగు గ్రామం. బాపట్ల సమీపంలోని కుందూరు మండలం. నేను సమంతకు అభిమానిని. మూడేళ్ల నుంచి సమంత బర్త్ డే సెలబ్రేట్ చేస్తున్నాను. ఆమె పుట్టిన రోజున అనాథ పిల్లలకు సహాయం చేస్తున్నాం. ఆమె చేసే సామాజిక సేవకు మేము కూడా భాగమయ్యాం అని అన్నారు.
ఇదిలా ఉండగా, ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత నిర్మించిన తొలి చిత్రం శుభం. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల ఆవిష్కరించారు. ఈ సినిమాను మే 9న విడుదల చేయనున్నారు. వివేక్ సాగర్ బీజీఎం స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











