For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోయిన్‌కు షాకిచ్చిన యువకుడు.. ఫొటో దిగడానికని వచ్చి ముద్దివ్వబోయాడు.!

  By Manoj
  |

  స్టార్ హీరో కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్. తన తండ్రి పేరును నిలబెట్టేందుకు ఆమె ఎంతగానో శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే చాలా మంది ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడుతోంది. ఈ క్రమంలోనే ఆమె ఎన్నో ఆఫర్లను దక్కించుకుంటోంది. అందంతో పాటు అభినయం ఉన్న నటి కావడంతో సారా కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ప్రస్తుతం ఆమె పలు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇలాంటి సమయంలో ఆమెకు ఓ అభిమాని మరిచిపోలేని షాక్ ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగింది.?

  మొదటి నుంచీ సక్సెస్ అవుతోంది

  మొదటి నుంచీ సక్సెస్ అవుతోంది

  సారా అలీ ఖాన్ ‘కేదార్‌నాథ్' అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో పాటు ఆమెకు ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టింది. దీని తర్వాత ‘టెంపర్' రీమేక్‌గా తెరకెక్కిన ‘సింబా'లో నటించి మెప్పించింది. ఇది కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో అమ్మడి కెరీర్ విజయవంతంగా సాగుతోంది.

  ఆ హీరోతో డేటింగ్‌తో వివాదాస్పదం

  ఆ హీరోతో డేటింగ్‌తో వివాదాస్పదం

  స్టార్ డాటర్ అయినప్పటికీ సారా అలీ ఖాన్ సాదాసీదాగా ఉండడానికే ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే తన లవర్‌తోనూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తుంది. ఆమె కార్తిక్ ఆర్యన్ అనే యంగ్ హీరోతో కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ తరచూ కెమెరాల కంటికి చిక్కుతూనే ఉన్నారు. దీంతో సారా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది.

  విడిపోయానని ప్రకటించింది.. అయినా కలిసే

  విడిపోయానని ప్రకటించింది.. అయినా కలిసే

  కొద్ది రోజుల క్రితం సారా అలీ ఖాన్.. తన బాయ్ ఫ్రెండ్‌తో విడిపోయినట్లు చెప్పుకొచ్చింది. దీనికి కారణాలు అయితే వెల్లడించలేదు కానీ, ఇది నిజమేనని అంతా అనుకున్నారు. అయితే, ఇప్పటికీ వాళ్లిద్దరూ కలిసే తిరుగుతున్నారు. ఆమె అలా ప్రకటించిన తర్వాత కూడా పలుమార్లు కెమెరాల కంటికి చిక్కారు. దీంతో ఈ జంట డేటింగ్ కొనసాగిస్తుందని ప్రచారం జరుగుతోంది.

  ఎయిర్‌పోర్టులో మీద చేయి వేశాడు

  ఎయిర్‌పోర్టులో మీద చేయి వేశాడు


  ఇటీవల సారా అలీ ఖాన్‌కు ముంబై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఎయిర్‌పోర్టులోకి వెళ్తున్న క్రమంలో కొందరు గుర్తించి సెల్ఫీలు కావాలని అడిగారు. దీంతో సారా అందరి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ క్రమంలోనే ఓ యువకుడు వచ్చి ఆమెపై చేయి వేశాడు. దీంతో బిత్తరపోయిన సారా అలీ ఖాన్.. చేసేదేం లేక కూల్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

  ఫొటో దిగడానికని వచ్చి ముద్దివ్వబోయాడు

  ముంబైలో జరిగిన ఘటన వలె తాజాగా మరోసారి సారాకు ఊహించని అనుభవం ఎదురైంది. సిటీలోని ఓ జిమ్‌లో వర్కౌట్ చేసి వెళ్తున్న క్రమంలో కొందరు ఫొటోలు దిగడానికి వచ్చారు. అందులోని ఓ యువకుడు ఆమె చేతిని అందుకుని ముద్దివ్వబోయాడు. దీంతో వెంటనే చేయిని వెనక్కి లాక్కుంది. అక్కడే ఉన్న సెక్యూరిటీ ఆ యువకుడిని పక్కకు నెట్టేయడంతో ఆమె కారెక్కి వెళ్లిపోయింది.

  ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

  ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

  2009లో సైఫ్ అలీ ఖాన్ - దీపికా పదుకునే కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘లవ్ ఆజ్ కల్'. ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారు. ఇందులో సారా అలీ ఖాన్ - కార్తీక్ ఆర్యన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం కానుకగా 2020 ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. దీంతో పాటు కూలీ నెం 1లో నటిస్తోంది.

  English summary
  Bollywood actress Sara Ali Khan is undoubtedly one of the most promising actresses in the industry today. Though the actress is only two-movie-old, she has already created a niche for herself in the tinsel town. The actress is not only adored for her acting chops and sartorial choices.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X