Kajal Aggarwal: పబ్లిక్‌లో కాజల్‌కు చేదు అనుభవం.. అక్కడ చేయి వేసిన కుర్రాడు
టాలీవుడ్‌లో తనదైన శైలి యాక్టింగ్, గ్లామర్‌తో సత్తా చాటుతూ.. సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తోంది చందమామ కాజల్ అగర్వాల్. ఎన్నో ఆశలతో సినీ రంగంలోకి ప్రవేశించిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అలాగే, ఎన్నో విజయాలను సైతం సొంతం చేసుకుని స్టార్‌గా మారిపోయింది. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా కాజల్ అగర్వాల్‌కు పబ్లిక్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!
నేషనల్ రేంజ్‌కు ఎదిగింది:కాజల్ అగర్వాల్ 'లక్ష్మీ కల్యాణం' అనే సినిమాతోనే కెరీర్ ప్రారంభించింది. అందులో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న ఈ లేడీ.. ఆ తర్వాత తెలుగులో వరుసగా ఆఫర్లను దక్కించుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలో కూడా ఎన్నో సినిమాలు చేసింది. అలాగే బాలీవుడ్‌లో సైతం అడుగు పెట్టి కాజల్ కొన్ని చిత్రాల్లో నటించింది. తద్వారా నేషనల్ లెవెల్‌లో నేమ్, ఫేమ్ దక్కించుకుంది.

తల్లైన కాజల్.. గ్యాప్ ఇచ్చి:సినిమాల్లోకి ఎంటరైన తర్వాత వరుసగా సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్.. గౌతమ్ కిచ్లూ అనే వ్యాపారవేత్తతో రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపింది. ఇది రివీల్ అయిన కొద్ది రోజులకే అతడిని పెళ్లాడింది. ఆ తర్వాత కూడా కెరీర్ కంటిన్యూ చేసిన కాజల్.. గత ఏడాది ఓ మగ బిడ్డకు తల్లైంది. దీంతో కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకుని మాతృత్వాన్ని ఎంజాయ్ చేసేసింది.

రీఎంట్రీలో వరుస దెబ్బలే:తల్లైన తర్వాత చాలా రోజుల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. గత ఏడాదిలోనే 'కోస్టీ' అనే తమిళ చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ, ఇది ఆమెకు సరైన రీఎంట్రీ మాత్రం దక్కలేదు. దీని తర్వాత కాజల్ 'కరుంగాపియమ్' అనే తమిళ చిత్రాన్ని చేసింది. ఇది కూడా కాజల్‌కు మంచి సక్సెస్‌ను అందించడంలో ఫెయిల్ అయిపోయింది.

బాలయ్యతో హిట్.. వీటిలో:గతంలో మాదిరిగా తల్లైన తర్వాత అంతగా ఆఫర్లను అందుకోదని చాలా మందే అనుకున్నారు. కానీ, ఈ బ్యూటీ మాత్రం వరుసగా చిత్రాలు చేస్తోంది. ఇలా గత ఏడాది 'భగవంత్ కేసరి'తో వచ్చి సక్సెస్ సొంతం చేసుకుంది. దీని తర్వాత ఈ భామ.. 'ఇండియన్ 2', 'సత్యభామ' వంటి సినిమాలు చేస్తోంది. ఇవి మాత్రమే కాదు.. వేరే భాషల్లో సైతం ఫుల్లుగా ఆఫర్లు దక్కించుకుంటోంది.
కాజల్‌కు చేదు అనుభవం:చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. ఈ మధ్య కాలంలో ప్రైవేట్ ఈవెంట్లలో సైతం పాల్గొంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైంది. ఇందుకోసం ఎరుపు రంగు డ్రెస్ వేసుకుని మెరిసిపోయింది. ఇక, ఈ ఈవెంట్‌లో కాజల్‌కు చేదు అనుభవం ఎదురైంది.
చేయి వేసిన అభిమాని:తాజాగా ఈవెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో కాజల్ అగర్వాల్‌తో ఓ అభిమాని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె వచ్చిన వెంటనే పక్కకు వెళ్లిన అతడు.. నడుము మీద చేయి ఫొటో తీసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో కాజల్ బిత్తరపోయి పక్కకు జరిగేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతోంది.


Click it and Unblock the Notifications











