శ్రీముఖిని సర్‌ప్రైజ్ చేసిన కుర్రాడు: లవ్ సింబల్స్‌తో అతడికి రిప్లై.. ఏమైందో తెలిసే షాక్ అవుతారు!

శ్రీముఖి.. తెలుగు బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ చాలా కాలంగా ఈ రెండు రంగాల్లో తెగ సందడి చేస్తోంది. అంతేకాదు, వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. దీంతో ఈ అమ్మడు ఎక్కడ చూసినా తనే అన్నట్లుగా రచ్చ చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ హల్‌చల్ చేస్తోందీ యాంకర్. ఇందులో భాగంగానే ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ అభిమాని శ్రీముఖిని సర్‌ప్రైజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనే తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అంతేకాదు, అతడికి లవ్ సింబల్స్‌తో కూడిన రిప్లై ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలేంటో చూద్దాం పదండి!

 యాంకరింగ్‌కు ముందే సినిమాలు

యాంకరింగ్‌కు ముందే సినిమాలు

అల్లు అర్జున్ నటించిన 'జులాయి' మూతో శ్రీముఖి నటిగా తన కెరీర్‌ను ఆరంభించింది. ఇందులో చక్కటి నటనను కనబరించి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసి మెప్పించింది. అంతేకాదు, శ్రీముఖి 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గానూ నటించింది.

యాంకర్‌గా మారి సత్తా చాటుతోంది

యాంకర్‌గా మారి సత్తా చాటుతోంది

వరుసగా సినిమాలు చేస్తోన్న సమయంలోనే శ్రీముఖి బుల్లితెరపైకి యాంకర్‌గా అడుగు పెట్టింది. 'అదుర్స్' అనే షోతో మొదలైన ఆమె ప్రస్థానంలో ఎన్నో షోలు చేసింది. ఈ క్రమంలోనే 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలను హోస్ట్ చేసి పేరు అందుకుంది.

బిగ్ బాస్ షోతో మళ్లీ పుంజుకుంది

బిగ్ బాస్ షోతో మళ్లీ పుంజుకుంది

వరుసగా షోలు, సినిమాలు చేస్తోన్నప్పుడే శ్రీముఖి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ మూడో సీజన్‌లోకి అడుగు పెట్టిన ఈ భామ.. రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. కానీ, ఈ షో వల్ల తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. అలాగే, ఆఫర్లను కూడా అందుకుంటోంది. దీంతో శ్రీముఖి ఆచితూచి అడుగులేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.

రెండు సినిమాలు.. మంచి పేరుతో

రెండు సినిమాలు.. మంచి పేరుతో

బిగ్ బాస్ షోకు ముందు.. ఇకపై సినిమాలు చేయనంటూ శ్రీముఖి బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే ఆమె చాలా కాలం వెండితెరపై కనిపించలేదు. అయితే, ఇప్పుడా నిర్ణయాన్ని మార్చుకుని ఇటీవలే ఆమె 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే, నితిన్ 'మాస్ట్రో'లో సైతం ముఖ్యమైన పాత్రలో కనిపించి సత్తా చాటుకుంది.

 అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

కెరీర్ పరంగా బిజీగా ఉన్నా.. లేకున్నా హాట్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ పోస్టులు చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఆమె తన ఫాలోవర్ల సంఖ్యను క్రమంగా పెంచుకుంటోంది.

శ్రీముఖిని సర్‌ప్రైజ్ చేసిన కుర్రాడు

శ్రీముఖిని సర్‌ప్రైజ్ చేసిన కుర్రాడు

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే శ్రీముఖికి ఎనలేని గుర్తింపు దక్కింది. దీంతో ఆమెను అభిమానించే వాళ్లు క్రమంగా పెరుగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె అభిమాని అయిన ఓ కుర్రాడు తాజాగా ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో అతడు శ్రీముఖి పేరును తన చేతిపై పచ్చబొట్టు పొడిపించుకుని సర్‌ప్రైజ్ చేశాడు. దీన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.

Recommended Video

Jabardasth Comedian నా పెళ్లి జరగకపోతే అందుకు కారణం Sreemukhi, Jhansi నే
లవ్ సింబల్స్‌తో అతడికి రిప్లై ఇచ్చి

లవ్ సింబల్స్‌తో అతడికి రిప్లై ఇచ్చి

తనపై ఉన్న అభిమానంతో పచ్చబొట్టు పొడిపించుకున్న సదరు అభిమాని వీడియోను షేర్ చేసిన శ్రీముఖి 'ఓ మై గాడ్.. నిజమేనా? కానీ ఎందుకిలా చేశావ్' అంటూ లవ్ సింబల్స్‌తో కూడిన రిప్లై ఇచ్చింది. దీంతో సదరు అభిమానితో పాటు మిగిలిన వాళ్లందరూ ఇది చూసి షాక్ అవుతున్నారు. ఇక, దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X