బాత్ టబ్‌లో పవన్ కల్యాణ్ హీరోయిన్ వీడియో వైరల్.. బిడ్డకు తల్లివై ఉండి అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్స్

బాపుగారి బొమ్మ అంటూ తెలుగులో పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్. ఏం పిల్లో.. ఏం పిల్లడో అనే సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయం ఉన్నా కూడా అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. మొదటి సినిమా అసలు ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికి తెలియకుండా పోయింది. ఆ తరువాత సిద్దార్థ్ సరసన బావ సినిమాలో మెరిసింది. ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కానీ, అవకాశాలను మాత్రం అందుకుంది.

తెలుగులో అంతగా గుర్తింపు దక్కకపోయేసరికి కన్నడ ఇండస్ట్రీలో పాగా వేసి.. అక్కడ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అదే సమయంలో త్రివిక్రమ్ - పవన్ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది ప్రణీత కు స్టార్ డమ్ ను తీసుకొచ్చి పెట్టింది.. ఇందులో పవన్ తో బాపుగారి బొమ్మ అని అనిపించుకుంది. ఈ సాంగ్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ సినిమా తరువాత ప్రణీత సెకండ్ హీరోయిన్ గానే సెటిల్ అయిపొయింది. రామయ్య వస్తావయ్యా, హలొ గురు ప్రేమ కోసమే లాంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.

Fans and Netizens trolled heavily pranitha subhash for sharing bath tub video

ఇక కెరీర్ అటుఇటుగా ఉండడంతో ప్రణీత పెళ్లి పీటలు ఎక్కేసింది. 2021 లో బెంగుళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్ నితిన్ రాజ్ తో ప్రణీత వివాహం చాలా సింపుల్ గా జరిగింది. పెళ్లి తరువాత కూడా ప్రణీత సినిమాల్లో నటిస్తానని తెలిపింది. అయితే సినిమాలు ఏమో కానీ.. తెలుగులో పలు షోస్ కు జడ్జిగా మాత్రం మారింది. ఇకపోతే 2022 లో ఆమె ఒక పాపకు కూడా జన్మనిచ్చింది.

సాధారణంగా.. ఏ హీరోయిన్ అయినా.. పెళ్ళికి ముందు అందాల ఆరబోత చేస్తుంది.. పెళ్లి తరువాత .. బిడ్డ పుట్టాకా అందాల ఆరబోతను తగ్గిస్తారు . కానీ, ప్రణీత విషయంలో ఇది రివర్స్.. ఈ చిన్నది పెళ్లి తరువాత అందాల ఆరబోత మరింత పెంచింది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో అదరగొడుతోంది. బీచ్ ఒడ్డున బికినీలో.. డిజైనర్ డ్రెస్ ల్లో క్లివేజ్ షో ఒకపక్క.. థైస్ షో మరోపక్క చేస్తూ సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తోంది.

Fans and Netizens trolled heavily pranitha subhash for sharing bath tub video

ఇక తాజాగా ప్రణీత కొంచెం హద్దుదాటి బాత్ టబ్ లో స్నానం చేస్టున్న వీడియోను షేర్ చేసింది. బాత్ టబ్ లో ప్రణీత నురుగులో కూర్చుని బబుల్స్ ఉదుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇక దీనికి ఒక మంచి క్యాప్షన్ కూడా పెట్టుకొచ్చింది. "సెల్ఫ్ కేర్ అంటే బబుల్ బాత్ కాదు అని చాలామంది అంటూ ఉంటారు కానీ హాట్ బబుల్ బాత్ కంటే మరి ఏదీ అంత రిలాక్సింగ్ గా అనిపించదు" అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయకు అని కొందరు అంటుండగా.. ఒక బిడ్డకు తల్లి అయ్యాకా కూడా ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయడం ఎందుకు.. ? అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విమర్శలపై ప్రణీత ఎలా స్పందిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X