హీరోయిన్లపై అభిమానం, గుడులు కట్టి పూజలు.. ఇప్పటివరకు ఎంతమందికి కట్టారంటే?

నటులు, నటీమణులకు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. వారు సినిమాల్లో మాత్రమే హీరోలుగా చేసినా రియల్ లైఫ్ లో కూడా హీరోలుగానే చూస్తుంటారు చాలా మంది. అలాగే హీరోయిన్లను కూడా. కొంత మంది విపరీతంగా ద్వేషించడం, వారిపై ట్రోల్స్ చేయడం వంటివి మనం తరచుగానే చూస్తుంటాం. కానీ హీరోయిన్లను దేవతలుగా భావించే ఆరాధించే వారు కూడా ఉంటారు. ఇది మనకు కాస్త ఆశ్చర్యం కల్గించినా ఇదే కూడా నిజమే. ఇక ఇప్పటివరకు ఎవరెవరికి గుడులు కట్టారు అనే వివరాల్లోకి వెళితే..

ఇటీవల సమంతకు కొత్త గుడి:బాపట్ల జిల్లా చండూరు మండలానికి చెందిన సందీప్ సమంతకు వీరాభిమాని. తన అభిమానానికి గుర్తుగా తన సొంత ఇంటి ఆవరణలో సామ్ కు గుడి కట్టాడు. వీలున్నప్పుడల్లా ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటాడు. అలాగే సామ్ కు మయోసైటిస్ వ్యాధి సోకినప్పుడు ఆమె త్వరగా కోలుకోవాలని పుణ్యక్షేత్రాల చుట్టూ తిరిగాడు. మొక్కులన్నీ చెల్లించుకొని తన అభిమానాన్ని చాటుకున్నాడు.

Fans build temples for South Indian heroines Samantha Ruth Prabhu, Hansika Motwani, and Khushbu Sundar

మొట్ట మొదటగా ఎవరికంటే..:కుష్బూ... సౌత్ ఇండియాలో మొట్ట మొదటగా ఓ హీరోయిన్ కు గుడి కట్టడం తొలిసారి. కుష్బూయే ఆ అభిమానాన్ని అందుకో గలిగింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచురాపల్లిలో కుష్బూకు అభిమానులు గుడి కట్టి పూజలు నిర్వహించారు. 90లలో కుష్బూ సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

Fans build temples for South Indian heroines Samantha Ruth Prabhu, Hansika Motwani, and Khushbu Sundar

నమితకు మూడు గుడులు:హాన్ అండ్ క్యూట్ బ్యూటీ నమితకు కూడా తమిళులు గుడి కట్టారు. తమిళనాడు రాష్ట్రంలో ఏకంగా ఆమెకు మూడు గుడులు ఉన్నాయి. కోయంబత్తూర్, తిరునెల్వేలితో పాటు మరో ప్రాంతంలోనూ ఈమెకు గుడులు ఉన్నాయి. తెలుగులో జెమిని, సొంతం, సింహ, జగన్మోహిని చిత్రాల్లో నటించింది.

Fans build temples for South Indian heroines Samantha Ruth Prabhu, Hansika Motwani, and Khushbu Sundar

హన్సికకు కూడా ఒక గుడి:2007లో దేశముదురు సినిమా ద్వారా సినీ రంగంలో అడుగు పెట్టిన హన్సిక అతి తక్కువ కాలంలోనే అనేక అవకాశాలను చేజిక్కించుకుంది. అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా వెలుగొందింది. ఆ తర్వాత కోలీవుడ్ లో నూ పలు చిత్రాలల్లో నటించి లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. చైన్నై శివారులో ఈమెకు గుడి కట్టారు.

Fans build temples for South Indian heroines Samantha Ruth Prabhu, Hansika Motwani, and Khushbu Sundar

నగ్మ కోసం గుడులు:జ్యోతిక అక్క నగ్మ గురించి కూడా తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమెకు కూడా తమిళనాడులో గుడులు ఉన్నాయి. 90లలో నగ్మ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ.. అగ్ర నటులందరి సరసన నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్ లో ఆమెకు ఎక్కువగా అభిమానులు ఉన్నారు.

చెన్నైలో నిధి అగర్వాల్ కోసం:2017లో మున్నా మైకల్ అనే హిందీ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన నిధి అగర్వాల్.. ఆ తర్వాత ఏడాది తెలుగు సినీ రంగంలోనూ అడగు పెట్టింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాధించుకున్న ఈ క్యూట్ బ్యూటీకి తమిళ్ లో చాలానే ఫ్యాన్స్ ఉన్నారు. చెన్నైలో ఈమెకు అభిమానులు గుడి కట్టారు.

Fans build temples for South Indian heroines Samantha Ruth Prabhu, Hansika Motwani, and Khushbu Sundar

కాజల్ పేరు మీద అక్కడ గుడి:అలాగే లక్ష్మీ కల్యాణం సినిమాతో 2007లో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన కాజల్ అగర్వాల్.. చందమామ సినిమాతో మరింత క్రేజ్ సంపాధించుకుంది. తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 2007 నుంచి ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తమిళనాడులో ఈమెకు ఆమె ఫ్యాన్స్ గుడి కట్టించారు. నయనతారకు కూడా ఆమె అభిమానులు గుడి కట్టేందుకు ప్రయత్నించారు కానీ ఆమె నిరాకరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X