ఆ ఫోటో చూడగానే రెచ్చిపోయారు... అమలా పాల్‌పై వల్గర్ కామెంట్స్!
సినిమా సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో కొందరు అసభ్యమైన కామెంట్లతో రెచ్చిపోవడం తరచూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా హీరోయిన్లకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. వారు ఏదైనా ఫోటో లేదా వీడియో పోస్ట్ చేయగానే ఆకతాయిలు నీచమైన బుద్ది ప్రదర్శించిన సందర్భాలు అనేకం.
సౌత్ హీరోయిన్ అమలా పాల్‌కు తాజాగా అలాంటి అనుభవమే ఎదురైంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పెట్టిన చేసిన ఫోటో కింద వందలాది వల్గర్ కమెంట్స్ పోస్ట్ అయ్యాయి. అఫ్ కోర్స్ అమలా పాల్ ఈ ఫోటోకు పెట్టిన క్యాప్షన్ కూడా ఇలాంటి కామెంట్స్ రావడానికి కారణమైంది.

నేను ఇపుడు హ్యాపీ మ్యాంగో
అమలా పాల్ తాజాగా మామిడి పండు రంగులో ఉండే టాప్ ధరించిన ఫోటోలు సమ్మర్ స్పెషల్ అంటూ షేర్ చేశారు. అంతటితో ఊరుకుంటే బావుండేది... ‘నేను ఏది కావాలంటే అది కావొచ్చని వారు చెప్పారు. సో నేను ఈ రోజు హ్యాపీ మ్యాంగో' అంటూ తన డ్రెస్ కలర్ ఉద్దేశించి తనకు ఇష్టమైనప కలర్ యోల్లో అంటూ అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు.

మరో రకంగా అర్థం చేసుకున్న ఫ్యాన్స్
అయితే మ్యాంగో అనే పదం వాడుతూ అమలా పాల్ కామెంట్ చేయడంపై కొందురు అభిమానులు మరో రకంగా అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. వల్గర్ కామెంట్లతో రెచ్చిపోయారు. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి,. కొందరైతే చెప్పడానికి వీల్లేని పదాలు వాడటం కనిపించింది.

అమలా పాల్ తీరు తప్పుబడుతూ...
అమలా పాల్ పోస్ట్ కింద వస్తున్న వల్గర్ కామెంట్లను చూసి తట్టుకోలేని కొందరు ఫ్యాన్స్.... అమలా పాల్ తీరును తప్పుబట్టారు మీరు మ్యాంగో అనే పదం వాడుతూ క్యాప్షన్ పెట్టి ఉండాల్సింది కాదు. అందువల్లే మీపై ఇలాంటి వల్గర్ కామెంట్స్ వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అమలా పాల్
అమలా పాల్ సినిమాల విషయానికొస్తే... గతేడాది కేవలం 2 సినిమాల్లో మాత్రమే నటించిన ఈ కేరళ బ్యూటీ ప్రస్తుతం 7 సినిమాల్లో నటిస్తోంది. అందులో రెండు తమిళ చిత్రాలతో పాటు నాలుగు మలయాళ చిత్రాలు, ఒక హిందీ మూవీ ఉంది. ప్రస్తుతం ఈ చిత్రాలన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











