కియారా అద్వానీ డ్రెస్ హాట్ టాపిక్... ట్రోలింగ్ చేస్తున్న ఫ్యాన్స్!
నటి కియారా అద్వానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన పిక్ హాట్ టాపిక్ అయింది. బ్రైట్ ఎల్లో డ్రెస్ ధరించిన కియారా పిక్ మీద రకరకాల ట్రోల్స్ దర్శనమిస్తున్నాయి. ఈ ట్రోల్స్ రావడానికి కారణం ఆమె ధరించిన డ్రెస్ వెరైటీగా ఉండటమే. ఈ డిజైనర్ డ్రెస్‌ను చాలా మంది మాగీ నూడుల్స్‌తో పోల్చడం గమనార్హం.
ఓ అభిమాని కియారా డ్రెస్సుపై రియాక్ట్ అవుతూ.. "మసాలా మాగ్గి" అంటూ కామెంట్ పెట్టారు. మరొకరు "మీరు మాగీని ఎక్కువగా ప్రేమిస్తున్నారు" అంటూ వ్యాఖ్యానించారు. "మాగీ ఇంతకు ముందు అంత బాగా కనిపించలేదు" అంటూ ఇంకొకరు కామెంట్ పెట్టారు.

మరొక యూజర్ ఇలా వ్రాశాడు... "మీకు మాగీ మీద బోర్ కొట్టి ఇలా డ్రెస్ తయారు చేశారు. ఫుడ్ వేస్ట్ కాకుండా ఇదే ఉత్తమ మార్గం" అని చెప్పుకొచ్చారు. కియారా నటించిన సినిమాల విషయానికొస్తే... షాహిద్ కపూర్ సరసన ఆమె నటించిన చివరి చిత్రం "కబీర్ సింగ్" బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.
ప్రస్తుతం 'గుడ్ న్యూస్' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ఖాన్, దిల్జిత్ దోసంజ్‌లతో కలిసి నటిస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. దీంతో పాటు లక్ష్మీ బాంబ్ అనే మరో చిత్రం చేస్తోంది.


Click it and Unblock the Notifications











