శ్రీలీల తరహాలోనే సూపర్ స్టార్ కూతురికి చేదు అనుభవం.. పొట్టి నిక్కరు భామను వేధించిన అకతాయిలు

భారతదేశంలో సినీతారలను అభిమానులు ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తారలకు గుడికట్టి పూజించే దేశం మనది. నటీనటుల బట్టలు, హెయిర్ స్టైల్, మేనరిజం ఇలా సమస్తం అనుకరిస్తారు. స్టార్స్ నుంచి అభిమానులు కోరుకునేది పెద్దగా ఏం ఉండదు.. వీలైతే ఓ ఆటోగ్రాఫ్, కుదిరితే ఓ సెల్ఫీ. అయితే కొందరు అభిమానుల్లో మాత్రం ఆకతాయిలు, పోకిరీలు కనిపిస్తుంటారు. ఇలాంటి వారు నటీనటులతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ తృటిలో ఇలాంటి వారి బారి నుంచి తప్పించుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..

శ్రీలీలను గుంపులోకి లాక్కెళ్లిన పోకిరి

హీరోల సంగతి ఏమో కానీ, హీరోయిన్లు పబ్లిక్‌లోకి వెళ్లాలంటేనే ఈ మధ్య వణికిపోతున్నారు. ఎవరు ఎటు వైపు నుంచి వచ్చి ఎలా ప్రవర్తిస్తారోనని వాళ్ల భయం. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ - శ్రీలీల కలిసి ఆషికి 3 షూటింగ్ నిమిత్తం పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు వెళ్లారు. షూటింగ్ ముగించుకుని ప్రజలకు అభివాదం చేస్తూ వస్తుండగా శ్రీలీలను కొందరు ఆకతాయిలు చేయి పట్టుకుని గుంపులోకి లాక్కెళ్లిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను క్షేమంగా పక్కకి తీసుకొచ్చారు.

Fans surround Bollywood Actress Sara Ali Khan here is the details

మంజు వారియర్‌ నడుము గిల్లిన ఆకతాయి

గత వారం మలయాళ నటి మంజు వారియర్‌తో ఆకతాయిల వేధింపులను ఎదుర్కొన్నారు. బెంగళూరులోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వచ్చి కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఆమెను అభిమానులు చుట్టుముట్టారు. ఇంతలో ఓ వ్యక్తి ఆమె నడుమును గిల్లగా , మరికొందరు ఆమె ఛాతి భాగాన్ని తాకేందుకు యత్నించాడు. దీంతో వణికిపోయిన మంజు వారియర్ వెంటనే కారెక్కి వెళ్లిపోయారు. ఇలాంటి వారి దెబ్బకు హీరోయిన్లు, మహిళా నటులు రోడ్డు మీదకి రావడానికి వణికిపోతున్నారు.

వర్కవుట్స్‌తో బిజీగా సారా అలీఖాన్

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్‌.. కుర్రాళ్ల దెబ్బకు వణికిపోయారు. ఈ ఏడాది స్కైఫోర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సారా అలీఖాన్ ప్రస్తుతం మెట్రో ఇన్ దినోతో పాటు మరో సినిమాలో నటిస్తున్నారు. శరీరాన్ని అందంగా, ఫిట్‌గా ఉంచుకునేందుకు ఆమె నిత్యం యోగా, వర్కవుట్స్ చేస్తుంటారు. ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను కూడా ఆమె తరచూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ నుంచి సారా అలీఖాన్‌కు ఊహించని అనుభవం ఎదురైంది.

సారా అలీఖాన్‌ను చుట్టుముట్టిన అభిమానులు

ముంబైలోని ఓ జిమ్ నుంచి వర్కవుట్స్ ముగించుకుని వస్తున్నారు సారా. ఆ సమయంలో పొట్టి నిక్కరు, టీ షర్ట్, చేతిలో మిల్క్ షేక్‌ నుట్టుకుని వస్తున్న సైఫ్ కుమార్తెను కొందరు కుర్రాళ్లు చూశారు. దీంతో సెల్ఫీల కోసం ఆమె వెంటపడ్డారు. ఒకేసారి అంతమంది గుమిగూడటం, పైగా తను ఒంటరిగా ఉండటంతో సారా కంగారు పడ్డారు. జరగరానిది జరగడానికి ముందే అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఆమె రోడ్డుపై పరుగులు తీశారు. అయినప్పటికీ ఈ ఆకతాయిలంతా సారాను వెంబడించారు. ఎలాగోలా కారెక్కిన సారా అలీఖాన్ వారి బారి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు. అయితే ఈ వీడియో ఎప్పుడు? ఎక్కడ తీశారన్నది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X