12 ఏళ్లలో 19 ఫ్లాపులు.. కెరీర్ లో ఒకే ఒక్క హిట్ ఇచ్చిన సూపర్ స్టార్ కొడుకు ఎవరో తెలుసా?
స్టార్ కిడ్స్ కు సినిమాల్లో అవకాశాలకు కొదవ ఉండదు అన్న విషయం తెలిసిందే. అయితే ఓ సూపర్ స్టార్ కొడుకు మాత్రం ఏకంగా పన్నెండేళ్లలో 19 డిజాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నేళ్ళలో కేవలం ఒకే ఒక్క హిట్ కొట్టినప్పటికీ, ఇంకా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్నాడు. ఆ స్టార్ కిడ్ ఎవరు అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
బాలీవుడ్ లో నెపోటిజం గురించి తరచుగా ప్రస్తావనకు వస్తూ ఉంటుంది. యాక్టింగ్ స్కిల్స్ లేకపోయినా బాక్గ్రౌండ్ కారణంగా జనాలపై రుద్దుతారు అనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. తాజాగా వరుసగా 19 డిజాస్టర్ లు అందుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ తనయుడు ఫిరోజ్ ఖాన్ కొడుకు ఫర్దిన్ ఖాన్ హీరామండి మూవీతో మరోసారి ఈ విషయం చర్చకు వచ్చింది. ఫర్దిన్ ఖాన్ దాదాపు 14 ఏళ్ల తర్వాత హీరామండి మూవీలో కీలకపాత్రను పోషిస్తున్నాడు. ఇందులో ఆయన నవాబ్ వలీ మహమ్మద్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ బాలీవుడ్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ ఎలా జరిగింది ? అంటే...

ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ ఫిరోజ్ ఖాన్ కొడుకే ఫర్దిన్ ఖాన్. ఫిరోజ్ ఖాన్ వారసుడిగా ఫర్జిన్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. స్వయంగా ఫర్దిన్ ఖాన్ స్వయంగా తన కొడుకు మొదటి మూవీకి దర్శకత్వం వహించాడు. కానీ ప్రేమ్ అగ్గన్ టైటిల్ తో రూపొందిన ఆ మూవీ ప్లాప్ గా నిలిచింది. అలా మొదటి మూవీనే బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడి తండ్రి కొడుకులను నిరాశకు గురిచేసింది. అయితే ఫర్దిన్ మాత్రం సినిమా ఇండస్ట్రీపై ఆశలు వదులుకోలేదు. వరుసగా మరో 15 సినిమాలు చేశాడు. కానీ అవన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ కావడం గమనార్హం.
అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేసి ఎట్టకేలకు హేయ్ బేబీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఫర్దిన్ కెరియర్ కు ఎండ్ కార్డు పడినట్టే అనుకుంటున్న సమయంలోనే ఈ మూవీ వచ్చి అతన్ని ఒడ్డున పడేసింది. 2007లో రిలీజ్ అయిన హేయ్ బేబీ మూవీలో అక్షయ్ కుమార్, రితీష్ దేశ్ ముఖ్, విద్యాబాలన్, ఫర్దీన్ ఖాన్, అనుపమ్ కేర్, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించారు. దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 83 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఫర్దిన్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఒకే ఒక మూవీగా రికార్డును క్రియేట్ చేసింది.

ఆ తర్వాత కూడా ఫర్జిన్ సినిమాలు చేసినప్పటికీ ఏమాత్రం అతని కెరీర్ అతని కెరీర్ పుంజుకోలేదు. బాలీవుడ్ స్టార్ కావాలన్న ఆయన కలగానే మిగిలిపోయింది. ఫర్దీన్ చివరిసారిగా దుల్హ మిల్ గయా అనే మూవీలో కనిపించాడు. 2010లో రిలీజ్ అయిన ఈ మూవీలో సుష్మిత సేన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా ప్లాప్ కావడంతో ఆయన సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత దాదాపు 14 ఏళ్లు సినిమాల వైపు కన్నెత్తి చూడని ఫర్దీన్ ఖాన్ ది హీరామండి : డైమండ్ బజార్ మూవీతో రీఎంట్రీకి రెడీ అయ్యాడు. హీరామండీ మూవీ మే 1న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది. మరి ఇన్నేళ్ల ఆయన నిరీక్షణకు హీరామండీ రిజల్ట్ వర్త్ వర్మ అనిపిస్తుందా? అనేది వెయిట్ అండ్ సీ.


Click it and Unblock the Notifications











