Faria Abdullah అసభ్యమైన ప్రశ్న అడిగిన నెటిజన్.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన చిట్టి!
జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. నిజానికి ఫరియా అబ్దుల్లా యూట్యూబర్‌గా ముందే హైదరాబాద్ కుర్రకారుకు పరిచయమే. కానీ ఈ భామ జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఆమె ఈ సినిమాలో చిట్టి పాత్రలో నటించిన మరీ కుర్రాళ్ళ మనసు దోచేసింది. సోషల్ మీడియాలో బాగా ఆక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా తన గురించి కామెంట్ చేసిన నెటిజన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

హీరోయిన్‌గా
జాతి రత్నాలు సినిమాలో తనదైన అందంతో పాటు అభినయంతో యువకుల మనసు దోచేసింది ఈ భామ.నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో తెరకెక్కిన జాతి రత్నాలు సినిమాలో ఈ హైదరాబాదీ బ్యూటీ హీరోయిన్‌గా నటించింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. స్టేజ్ నాటకాల్లో దాదాపు 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ భామ సమాహార అనే ఒక థియేటర్ గ్రూప్ ద్వారా నటన కూడా నేర్చుకుంది. అయితే చిన్నప్పటి నుంచే డాన్స్ అంటే ఈ భామకు చాలా ఆసక్తి ఉంది. చిన్నతనం నుంచి ఆమె డాన్స్ చేసేది. ఆ ఆసక్తి గమనించి తల్లిదండ్రులు ఆమెను డాన్స్ క్లాస్ లో చేర్చారు.

షేర్ చేస్తూ
డ్యాన్స్ లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఎవరైనా మైకేల్ జాక్షన్ అనో ఇంకోటో చెబుతారు కానీ ఈ భామ ఫేమస్ బెల్లీ డాన్సర్ మెహర్ మాలిక్ తనకు ఇన్స్పిరేషన్ అని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉండే ఈ భామ ఎప్పటికపుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.

షేవ్ చేసుకోలేదా?
అయితే ఈ భామ తాజాగా తన సోషల్ మీడియాలో ఏదో ఈవెంట్ ను ప్రమోట్ చేస్తున్న ఈ భామ ఒక స్లీవ్ లెస్ ఫోటో షేర్ చేసింది. ఆ ఫొటోలో ఆమె చేతులు పైకెత్తి ఉండడంతో షేవ్ చేసుకోలేదా? అంటూ ఒక నెటిజన్ వల్గర్ గా కామెంట్ చేశాడు. సాధారణంగా అయితే వదిలేయాలి కానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని ఫరియా ఫిక్స్ అయింది.

పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తు
అందులో భాగంగానే ఆమె చేసినా, మళ్ళీ వచ్చింది, ఎన్ని సార్లు చేయాలా? అని ప్రశ్నించింది. దీంతో దిమ్మతిరిగిన సదరు నెటిజన్ ఆ కామెంట్ డిలీట్ చేశాడు. అయితే అప్పటికే ఆ కామెంట్ ను చాలా మంది స్క్రీన్ షాట్లు తీయడంతో ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్ తో మీమ్ పేజెస్ వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
Recommended Video

పెద్ద ఎత్తున ప్రచారం
ఫరియా అబ్దుల్లాకి జాతి రత్నాలు తొలి సినిమానే అయినా సూపర్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకే ఫరియా అబ్ధుల్లాకు ఆఫర్స్ ఇప్పుడు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీ కానుంది ఫరియా. కాగా ఈ భామ నాగార్జున నటిస్తోన్న బంగార్రాజు స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











